యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ నిరాడంబంరంగా అయినా వైభవంగా జరిగింది. కానీ అందరికీ ఒక్కటే లోటు కనిపిస్తోంది. ఆ లోటు చినజీయర్ స్వామి . యాదగిరి గుట్ట పేరును యాదాద్రి అనే పేరు పెట్టడం దగ్గర్నుంచి ఆలయం ఎలా ఉండాలో డిసైడ్ చేసే వరకూ.. చివరికి ప్రారంభోత్సవాన్ని ప్రపంచం మొత్తం ఆకర్షించేలా ఎలా చేయాలన్న అంశం వరకూ మొత్తం చినజీయర్ సలహాలతోనే జరిగింది. అలాంటి చినజీయర్ ఇప్పుడు యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవంలో కనిపించ లేదు.
తెలంగాణలో యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్చింది చినజీయర్. తిరమల స్థాయిలో యాదాద్రిని అభివృద్ధి చేసేలా కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా ప్రణాళికలు వేసింది చినజీయర్. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేారు. చివరికి ఆలయ ఆకృతుల కోసం సినీ ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయిని సిఫార్సు చేసింది కూడా చినజీయరేనని చెబుతూంటారు.స్థపతుల కన్నా ఆనంద్ సాయే ఎక్కువ ఆలయానికి డిజైన్ చేశారు. ఇక ఆగమ పరంగా యాదాద్రి ఆలయం మొత్తం చినజీయర్ సలహాలతోనే నడుస్తోంది. ఎందుకంటే అధికారికంగా ఆయన గుట్ట ఆలయానికి ఆగమ సలహాదారు కూడా . ఆలయం అద్బుతంగా రావడానికి చినజీయర్ కృషి ప్రధాన కారణం అనుకోవచ్చు.
మ్యూనికేషన్ గ్యాప్ అయినా..రాజకీయ ప్రభావం అయినా కారణాలు ఏమిటనేది చెప్పుకోకపోయినా… చినజీయర్‌కు కేసీఆర్‌తో గ్యాప్ వచ్చిందనేది నిజం. ఈ విషయంలో ఇరువురూ అంగీకరించకపోవచ్చు. తాము ఎవరితోనూ రాసుకుపూసుకు తిరగబోమని… అడిగితే సలహాలిస్తాం..లేకపోలేదని చినజీయర్ అంటారు. కానీ ఆయనలోనూ కేసీఆర్ దూరమయ్యారన్న బాధ ఉంది. యాదాద్రి ఆలయ ఆలోచన కేసిఆర్‌ది కావొచ్చు కానీ ఆచరణలోకి తెచ్చింది చినజీయర్. ఓ రకంగా అది ఆయన మానస పుత్రిక. మహాకుంభ సంప్రోక్షణ, నారసింహ మహాయాగం కూడా ఆయన చేతుల మీదుగానే జరిగి ఉంటే… ఈ ఆలయానికి ఆలోచన చేసి నిధులు కేటాయించిన కేసీఆర్‌తో పాటు చినజీయర్‌కు అంతటి పేరు ప్రఖ్యాతులు లభించి ఉండేవి. కానీ ఆయన ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.