అసలు లేని .. కట్టని ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో క్విడ్ ప్రో కో అంటూ సీఐడీ చంద్రబాబు ఉంటున్న ఇంటితో పాటు లింగమనేని, నారాయణలకు చెందిన ప్రైవేటు ఆస్తుల్ని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా ఆదివారం. నిజానికి ఆస్తులు జప్తు చేసే అధికారం సీఐడీకి లేదు. ఏదైనా ఉంటే కోర్టులో పెట్టి కోర్టు అనుమతితో మాత్రమే జప్తు చేయాలి. కానీ ఇక్కడ ఆదివారం కోర్టుకు సెలవు రోజు అని.. హడావుడిగా జప్తు ఆదేశాలిచ్చారు. తర్వాత ఇప్పటి వరకూ కోర్టులో జప్తును గుర్తించాలని పిటిషన్ వేయలేదు.
ఆస్తుల్ని జప్తు చేయడానికి వాడిన బ్రిటిష్ కాలం నాటిని ఆర్డినెన్స్, చట్టం ఏమిటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు లింగమేనని గెస్ట్ హౌస్ లింగమనేని పేరు మీదనే ఉంటే.. చంద్రబాబు ఇల్లు అని అటాచ్ చేయడమే .. ఓ పెద్ద ” పిల్ల చేష్ట” అని కొత్త లాయర్లు కూడా ఫక్కున నవ్వుకుంటున్నారు. ఇక అసలు అవినీతి వల్ల ఆ ఆస్తులు పోగుపడి ఉంటేనే జప్తు చేయాలనే నిబంధన ఉంది. నిజానికి ఆ ఆస్తులన్నీ రాష్ట్ర విభజనకు ముందు.. కనీసం ఓ పదిహేనేళ్ల కిందటి నుంచి వారి పేర్లపైనే ఉన్నాయి. కానీ ఏదో జరిగిందని చెప్పడానికి సీఐడీ ఆదివారం పూట ఈ జప్తు చేసింది కానీ..కోర్టుకెళ్లి ఏం చెప్పాలా అని తలబద్దలు కొట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
సీఐడీ ఇలా జప్తు నోటీసులు జారీ చేయడం ఆలస్యం.. నీలి కూలి మీడియాలు చెలరేగిపోయాయి. మొదటి రెండు రోజులు.. లో… తుగా దర్యాప్తు చేస్తున్నారని ప్రచారం చేశారు. చివరికి పవన్ కల్యాణ్‌కూ వాటా ఉందని పిల్ల బెదిరింపులు చేశారు. కనీస అవగాహన లేనట్లుగా చంద్రబాబు క్విడ్ ప్రో కో అంటూ రాసేశారు. . వారి తీరు చూసి.. పాపం వైసీపీ నేతలు అనుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. చేతిలో అధికారం ఉందని.. తప్పుడు ప్రచారం చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని.. అది వారిని జోకర్లుగా నిలబెడుతుందని టీడీపీ , జనసేన నేతలు సెటైర్లు ేశారు.
మొత్తంగా సీఐడీ.. ఇవాళ కాకపోతే రేపైనా కోర్టులో జప్తు కోసం అనుమతి తీసుకోవాల్సిందే. కానీ కోర్టు సాక్ష్యాలు అడుగుతుంది. వారి దగ్గర ఉండవు. వారికి కావాల్సింది తప్పుడు ప్రచారం చేయడం. అటాచ్ అనుమతి కోసం సీఐడీ కోర్టుకెళ్లినప్పుడు ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు కీలకం.