ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ నుంచి దిగ్గజ సంస్థలు వెళ్లిపోయాయి. లూలూ లాంటి సంస్థలు ఇక ఏపీలో పెట్టుబడి పెట్టమని ప్రకటించాయి. గత ప్రభుత్వం ఒప్పందంచేసుకున్న పెట్టుబడుల హామీలన్నింటికీ.., భూములు రద్దు చేయడం.. లేదా వెనక్కి తీసుకోవడం… వంటి చర్యల ద్వారా ప్రభుత్వం వెళ్లగొట్టింది. కానీ ఇప్పుడు భూములు ఇస్తామన్నా రావడం లేదు. అయితే వచ్చే అరకొర పెట్టుబడుల ప్రతిపాదలన్నీ.. కడప జిల్లాకే వెళ్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఒక్క పరిశ్రమకూ కనీసం ప్రతిపాదనలు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇంటలిజెంట్ సెజ్అనే సంస్థ వస్తోందదోచ్ అని ప్రచారం చేశారు.
అది కడప జిల్లాకే వస్తుందని ప్రకటించారు. అది మొదలు.. అనేక సంస్థలు కడప.. పులివెందుల, కొప్పర్తి పారిశ్రామిక వాడ అంటూ పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల ఆదిత్యబిర్లాసంస్థ కూడా ఓ యూనిట్‌ను కడప జిల్లాలోనే ఏర్పాటు చేసింది. ఇటీవల కొన్నిపరిశ్రమలకు సీఎం జగన్ కడపకువెళ్లి మరీ శంకుస్థాపనలు చేశారు. కానీ రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి శంకుస్థాపనల కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు తాజాగా ముల్క్ ఇండస్ట్రీస్ అనే సంస్థ పెట్టుబడులుపెడతాంఅంటే.. వారికి కూడా కడపలోని కొప్పర్తిని చూపించింది ప్రభుత్వం. ఇతర ప్రాంతాలపై దారుణమైన వివక్ష చూపుతూ కేవలం కడపనే పెట్టుబడులకు అధికారులుసిఫార్సు చేస్తున్న వైనం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. గత ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రానికి సాధించినపెట్టుబడులను … అన్ని జిల్లాలకూ కేటాయించింది.
వాటన్నింటినీరద్దు చేసిన ప్రభుత్వం… వచ్చే అరకొర పెట్టుబడులను ముఖ్యమంత్రి సొంత జిల్లాకు తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో వైసీపీలోని ఇతర ప్రాంతాల నేతలు కూడా నోరెత్తడం లేదు. పెట్టుబడి ప్రతిపాదనలేనని.,. అవి ప్లాంట్ లు ఎప్పటికి పెట్టాలని కొంత మంది లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంత వరకూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల్లో గ్రౌండింగ్ అయినది ఒక్కటీ లేదని గుర్తు చేస్తున్నారు.