అనారోగ్యంతో… ఉన్న సోనియా గాంధీ గొంతు పెగుల్చుకుని.. చిన్నమాట్లాడుతూ… పంటి కిందబాధను దిగమింగుంతూ… మేడ్చల్ బహింరగసభలో చేసిన ప్రసంగం చూసిన తర్వాత… ఎవరికైనా.. కాస్తంత జాలి కలుగుతుంది. అంత అనారోగ్యంతో ఆమ.. ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముందని అనిపించక మానదు. కానీ ఆమె వచ్చింది.. ఎందుకంటే.. తాము చేసిన త్యాగానికి తెలంగాణ ప్రజలు తమను ఎందుకు శిక్షించారో తెలుసుకుందామని.. ఈ సారైనా.. తమ త్యాగానికి ఒక్క ఓటు ఇస్తారనే ఆశతో వచ్చారు.
ఇష్టం లేని విభజన చేసినందుకు ఏపీ ప్రజలు కాంగ్రెస్ను పాతి పెట్టలేదా..?
తెలంగాణ ప్రజలకు దశాబ్దాల కల తెలంగాణ ఏర్పాటు.. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు జైఆంధ్ర ఉద్యమాలు నడిచాయి. అప్పట్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏపీ ప్రజలే కోరుకున్నారు. కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడదీసేది లేదని.. ఇందిరాగాంధీ తేల్చి చెప్పడంతో అది మరుగున పడిపోయింది. ఆ తర్వాత 2014లో మళ్లీ… విభజన అంశం తెరపైకి వచ్చింది. ఏపీ ప్రజలు… అసలు కోరుకోలేదు. ఏపీలో వంద మంది ఉంటే.. వంద మందీ… రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అయినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ఇచ్చిన మాట అంటూ.. రాష్ట్రాన్ని విడగొట్టేశారు. ఫలితంగా తమకు .. ఇష్టం లేని.. విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతి పెట్టారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోట అంటే.. ఒక్కచోట డిపాజిట్ కూడా రాలేదు. అంతగా శిక్షించారు.
మరి కల నెరవేర్చిన కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు ఎంత అండగా ఉండాలి..?
ఇష్టం లేని విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు పాతిపెట్టారు. అదే.. రేంజ్లో.. తెలంగాణ ప్రజలు… తమ దశాబ్దాల కలను నేరవేర్చిన పార్టీగా.. కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఆదరించలేదు..?. తమ ఆకాంక్షలను… గుర్తించి.. సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందున.. ప్రజలు .. నెత్తికెక్కించుకుంటారని… కాంగ్రెస్ పార్టీ కూడా ఆశ పడింది. కానీ.. ఏం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారు. అదీ కూడా అత్యంత దారుణంగా ఓడగొట్టారు. ఈ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలేదు. ఆశలు తీరిస్తే.. ఆదరిస్తారనుకుంటే… మొత్తానికే బండకేసి కొడతరాని ఊహించలేకపోయారు.
తెలంగాణ ప్రజలందరిదీ కేసీఆర్ మైండ్సెట్టేనా..?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయపార్టీ ప్రారంభించి … తల నరుక్కుంటానంటూ.. అందర్నీ రెచ్చిగొట్టేలా వ్యవహరించి.. బలిదానాలకు ప్రొత్సహించింది… కేవలం రాజకీయ లక్ష్యం సాధించడానికే. వెనుకబడిన తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాదు. ఈ విషయంలో.. తెలంగాణ ఏర్పాటు చేస్తే.. టీఆర్ఎస్ను కాంగ్రెస్లో కలిపేస్తా.. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి వంటి మాటల ద్వారా తేలిపోతుంది. ఓ సారి తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా.. ఇప్పుడు.. తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీనే… అడ్డగోలుగా విమర్శించేస్తున్నారు. అంటే… ఏరు దాటేదాకా.. ఓడ మల్లన్నా.. ఏరు దాటిన తర్వతా బోడి మల్లన్నలననమాట..!
కాంగ్రెస్ త్యానికి విలువ లేదా..?
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో సారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చెమటోడ్చుతోంది. తాము ఏర్పాటు చేసిన తెలంగాణలో.. నియంతృత్వ పాలన సాగుతోందన్న ఆవేదన ఓ వైపు… మళ్లీ ప్రజలు తమను ఆదరిస్తారో లేదోనన్న ఆందోళన మోర వైపు కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లయిన తర్వాత కూడా.. పక్క రాష్ట్రాన్ని.. ఆంధ్రులను … ఏపీ ముఖ్యమంత్రిగాని బూచిగా చూపిస్తూ.. చేసే రాజకీయానికి ప్రజలు తమను బలి చేస్తారా.. అని బాధపడుతున్నారు. మొత్తానికే.. త్యాగం చేసి… రాష్ట్రం ఏర్పాటు చేస్తే.. ప్రజల ఆశలు నెరవేరిస్తే.. తమకు శంకరిగిరి మాన్యాలేనన్నది వారి ఆందోళన. తెలంగాణ ప్రజలు అంత కృతఘ్నులు కాదని.. కల నెరవేర్చిన తమ పార్టీకి అండగా ఉంటారని నమ్ముతున్నారు. మరి నిజమవుతుందా..?
….సుభాష్