ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఇంట్లో మూడు రోజుల కిందట ఐటీ సోదాలు జరిగాయి. ఆయన రూ.120కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని సోదాల అనంతరం ఐటీ అధికారులు ప్రకటించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు కైలాశ్, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో దాడులు చేశారు. సోదాల అనంతరం ప్రకటన చేశారు. మరి ఇంచుమించుగా.. ఏపీలో ..తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులపై ఐటీ దాడులు జరుగుతున్నప్పుడే.. ఢిల్లీలోనూ జరిగాయి. మరి అక్కడ మీడియాకు రూ. 120 కోట్లు పన్ను ఎగ్గొట్టారని చెప్పుకొచ్చారు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం.. ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు. కావాల్సినన్ని రూమర్స్‌కు అవకాశం కల్పించి.. రోజుల తరబడి..సోదాలు చేసి… ఎందుకు సైలెంట్‌గా వెళ్లిపోతున్నారు. ఒక చోట దాడులకు..మరో చోట దాడులకు లింక్ ఉందన్న .. సమాచారం.. మీడియాకు లీక్ చేసి.. సోదాలు పూర్తయిన తర్వాత వివరాలు చెప్పకుండా ఎందుకు వెళ్లిపోతున్నారు..?
తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో మూడు రోజులు సోదాలు చేశారు. రేవంత్ రెడ్డికి బయట ఏం జరుగుతుందో తెలియకుండా.. చేసి..మరీ సోదాలు చేశారు. రేవంత్ రెడ్డి అలా ఇంట్లోకి వెళ్లగానే.. ఇటు ఫేక్ డాక్యుమెంట్స్‌తో ఆయనపై… వందల కోట్ల విదేశీ ఆస్తులంటూ.. కొన్ని మీడియాల్లో ప్రచారం ప్రారంభించారు. అంతా నిజమేననుకునేలా పరిస్థితి ఉంది. ఆ డాక్యుమెంట్లన్నీ ఐటీ డిపార్ట్మెంట్ పేరుతోనే విడుదలయ్యాయి. సోదాలు ముగిసిన తరవాత.. మీడియాలో జరిగిన ప్రచారం తెలిసి కూడా. . ఐటీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కనీసం.. రేవంత్ ఇంట్లో ఏం దొరికిందన్నదానిపైనా స్పష్టత లేదు. తనపై ప్రచారమైన డాక్యుమెంట్స్ అన్నీ ఫేకేనని.. రేవంత్ రెడ్డి ఇప్పుడు నెత్తినోరూ బాదుకుని చెప్పాల్సి వస్తుంది. ఐటీ అధికారులు చెబితే కానీ.. దీన్ని ఎవరూ నమ్మరు. అదే తరహాలో.. ఐటీ అధికారులు ఏపీలో దాడులు ప్రారంభించారు. టీడీపీలో కీలకంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు కంపెనీలు, ఎమ్మెల్యే పోతుల రామారావు కంపెనీల్లో సోదాలు చేశారు. ఏకంగా రెండు వందల మంది వచ్చి సోదాలు చేశారు. ఏం దొరికాయో ప్రకటన కూడా లేదు. అలాగే సీఎం రమేష్ ఇంట్లో.. రెండు రోజుల నుంచి సోదాలు చేశారు. దీనిపైనా స్పష్టత లేదు. మీడియా సమక్షంలో.. సోదాలకు సిద్ధమని.. సీఎం రమేష్ ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది.
ఐటీ అధికారులు ఢిల్లీలో మోడీతో ఢీ అంటే.. ఢీ అనే.. ఆప్ మంత్రిపై జరిపిన దాడుల్లో… రూ. 120 కోట్ల పన్ను ఎగ్గొట్టారని.. లీక్ చేశారో.. అధికారికంగా చెప్పారో కానీ… ఏపీలో మాత్రం అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఐటీ సోదాల పేరుతో… వారిపై దుష్ప్రచారం జరిగితే చాలన్న మిషన్‌తో వ్యవహరిస్తున్నారా..? లేక.. ఏమీ దొరకడం లేదా..? దొరికినా.. బయటకు చెప్పలేనంత సంపద ఉందా..? నిజంగా.. ఈ దాడులన్నీ పొలిటికల్ టార్గెట్లేనని.. చిన్న పిల్లవాడికైనా తెలుస్తుంది. ఇలాంటిదాడుల్లో… ఓ రూపాయి ఎక్కువ బయటపడినా.. రచ్చ రచ్చ చేస్తారు. మరి ఐటీ అధికారులు ఏమైనా దొరికితే ఎందుకు బయటపెట్టడం లేదు. అంతా మిస్టరీనే..!