ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఏపీ జనాభాను ఉన్న పళంగా పెంచాల్సిందేనని లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా రోజుల నుంచి ఆయన యువతకు సందేశం ఇస్తున్నారు. ఇప్పుడు.. ప్రత్యేకంగా ఓ పాలసీ తీసుకు రావాలని నిర్ణయించారు. ఏపీలో జనాభా వృద్ధికి ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఎక్కువ మంది పిల్లలను కనేవారిని ప్రోత్సహించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే అనర్హులనే నిబంధనను తొలగించామని ఆయన చెప్పారు. గతంలో తాను జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, అయితే ప్రస్తుతం రాష్ట్ర జనాభా తగ్గిపోయిందని ఆయన చంద్రబాబు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు సమతుల్యత కోసం జనాభా పెరగాల్సిన అవసరముందని అంటున్నారు.
నిజానికి జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ఫలితాల్ని సాధించాయి. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణ పాటించలేదు. ఫలితంగా..అక్కడ జనాభా పెరిగిపోయింది. దక్షిణాదిలో తగ్గిపోయింది. ఇదే విషయాన్ని పలుమార్లు ఖ్య తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని… ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జనాభా నియంత్రణ ఏపీ చంద్రబాబు విశ్లేషించారు. జనాభా నియంత్రణ పాటించడం వల్ల నియోజక వర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతంలో పార్లమెంట్ సీట్ల సంప్రభుత్వ విధానం కాదని స్పష్టంగా ప్రకటించారు.
నేటి యువత ఉద్యోగానికి, జీవితంలో స్థిరపడటానికి ప్రాధాన్యత ఇస్తూ పెళ్లిని వాయిదా వేస్తోంది. దీనివల్ల జనాభా తగ్గినా వారు పెళ్ళి చేసుకోకపోవటం వల్ల జనాభా పెరగటం లేదు. పెళ్లి చేసుకున్న వారు ఒక్క బిడ్డను మాత్రమే కంటున్నారు. దాంతో జనాభా గణనీయంగా తగ్గుతోంది. దక్షిణ కొరియాలో పెళ్లి కాని యువత 35 శాతం వరకు ఉన్నారుని.. జపాన్లో వృద్ధులే ఎక్కువగా ఉన్నారని తరచూ చెబుతంటారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర నిధుల కేటాయింపు జరపుతోందని.. దాని వల్ల నష్టపోవడం.. ఏపీ వంతవుతోందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఏపీ కోణంలోనే… ఎక్కువ మంది పిల్లల్ని కనమని.. యువతను ప్రొత్సహిస్తున్నారు.