ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రతిపక్ష నేతల ఆర్థిక మూలాలను కట్టడి చేయడానికి ఈడీ, ఐటీలు రంగంలోకి దిగిపోతాయి. అదే అధికారంలో ఉన్న పార్టీ అడ్డగోలుగా ధన రాజకీయాలు చేసినా పట్టించుకోరు.తెలంగాణ ఎన్నికల్లోనూ అదే కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి మొదలుకుని గడ్డం వివేక్‌ల వరకు వరుస పెట్టి కాగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు మొదలైన ఈ దాడుల పరంపర ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మరింత ఎక్కువయ్యాయి.
అధికార బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ఎన్నికల క్షేత్రాన్ని ప్రత్యర్ధులపై ఈడీ, ఐటీ దాడులకు వేదికగా మార్చిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను తమ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను వేధించేందుకు బిజెపి ఉపయోగించుకుంటున్న తీరు ఎన్నికల్లో ఆ పార్టీతో పాటు బీఆర్ఎస్ కు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
హైదరాబాద్ లో పట్టుబడుతున్న నగదు కూడా పూర్తిగా కొంత మందిని టార్గెట్ చేసుకున్నదే. వారి బ్యాంక్ ఖాతాలపై నిఘఆ పెట్టి ఏ మాత్రం తేడా ఉన్నా వెంటాడి మధ్యలో పట్టేసుకుంటున్నారు. మరి ఇక్కడ అధికార పార్టీ నేతలు డబ్బులు పంచడం లేదా అంటే… ఇప్పటికే వారి ఖర్చు వందల కోట్లు దాటిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ములుగు లాంటి చోట్ల నోట్ల కట్టలు పారుతున్న వైనంపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మరి వారి సొమ్ము ఎందుకు దొరకదు ? ఈ సీక్రెట్ మాత్రం ఎప్పటికీ బయటకు రాదు.