తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని.. జరుగుతున్న ప్రచారాన్ని ఆపాలని జగన్ రెడ్డి పరుగు పరుగున హైకోర్టుకు వెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఆయన నోటి వెంటే ఇంకే ఆప్షన్ లేదు. కోర్టులున్నాయని.. న్యాయవ్యవస్థ ఉందన్నట్లుగా చెబుతున్నారు. జగన్ రెడ్డికి న్యాయవ్యవస్థపై ఇంత నమ్మకం ఉందా అంటే.. ఆయన అవసరానికి మాత్రమే వస్తుందనుకోవాలి. స్వయంగా వెళ్లి కోర్టుకు పూచికత్తు సమర్పించడానికి నామోషీగా ఫీలయ్యి. . పాస్ పోర్టు కూడా తీసుకోని అసలైన వ్యక్తిత్వం లోపల అలాగే ఉంటుంది.
కోర్టుకెళ్లి పూచికత్తు సమర్పించని జగన్
జగన్ రెడ్డి కూతురి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు లండన్ పోవాలనుకున్నారు. పాస్ పోర్టు సమస్య వచ్చింది. ఆయనపై ఉన్న ఓకేసులో కోర్టుకు వచ్చి పూచికత్తు సమర్పించాలని దిగువ కోర్టు ఆదేశించింది. ఆయన హైకోర్టుకెళ్లారు. జగన్ రెడ్డి తీరును లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు కోర్టులంటే నమోషీ అని.. అక్కడకు వెళ్లడం పరువు తక్కువగా భావించి వెళ్లడం లేదన్నారు. అదే నిజమని నిరూపించారు. హైకోర్టు నేరుగా వెళ్లి పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. అయినా .. జగన్ రెడ్డి పాస్ పోర్టు అయినా వద్దనుకుంటాను కానీ.. కోర్టుకు పోవడమా అని ముఖం చాటేశారు.
తాను పెట్టిన కేసుల్లో సాక్ష్యం చెప్పడానికీ పోరు !
జగన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే.. న్యాయవ్యవస్థ అయినా తన కాళ్ల వద్దకు రావాలనుకుంటారు. విశాఖ ఎయిర్ పోర్టులో తనపై హత్యాయత్నం జరిగిందని కేసులు పెట్టించిన ఆయన ఆ కేసులో ఐదేళ్ల పాటు ఓ యువకుడు జైల్లో మగ్గిపోయినా పట్టించుకోలేదు. ఒక్క సారి కోర్టుకు వచ్చి ఏం జరిగిందో వాంగ్మూలం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. చివరికి కోర్టు కూడా సమన్లు జారీ చేసినా స్పందించలేదు. ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తనపై ఉన్న అత్యంత తీవ్రమైన కేసుల్లో కోర్టులకు డుమ్మా కొట్టారు. ఓడిపోయి పదవి పోయినా తర్వాత ఆ అహంకారం తగ్గించుకోలేదు.
ఇప్పుడు ప్రతీ దానికి కోర్టు !
జగన్ రెడ్డి ఇధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారు. తాము చేసేది ఎవరికీ తెలియదనుకుంటారు. అధికారం ముందు న్యాయవ్యవస్థ కూడా తల వంచుతుందని అనుకుంటారు. అందుకే ఆయన తనకు కష్టమొచ్చినప్పుడు పోలోమంటూ కోర్టుకెళ్తారు. రక్షించమని వేడుకుంటారు. కానీ తాను మాత్రం.. ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. నమ్మకం ఉందని చెప్పరు. తనకు అనుకూల తీర్పులు వచ్చినప్పుడు న్యాయవ్యవస్థ గొప్పది.. లేకపోతే చెడ్డది. అలాంటి ఓ ఘోరమైన రాజకీయ నాయకుడ్ని న్యాయవ్యవస్థ కూడా ఎప్పుడూ చూసి ఉండదు.