ఆంధ్రప్రదేశ్ తీవ్ర విద్యుత్ కష్టాల్లో ఉంది. కోతల్లేవ్ అని ప్రభుత్వం కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. పరిశ్రమలు మొత్తం పడకేసేలా పవర్ హాలీడే ప్రకటిం చేశారు. ఏకంగా 50 మిలియన్ యూనిట్ల లోటు ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సమస్యను ప్రభుత్వం ఎలా అడ్రెస్ చేస్తోంది.. పరిష్కరించేందుకు ఏం చేయబోతోంది అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. కరెంట్ కోతలు ప్రభుత్వానికి తీవ్రమైన చెడ్డ పేరు తీసుకు వస్తున్నాయి.పొరుగు రాష్ట్రాల్లో లేని కోతలు ఏపీలోనేఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో విద్యుత్ రంగంలో జగన్ తీసుకున్న నిర్ణయాలపై విస్తృత చర్చ జరుగుతోంది.
ఇలాంటి సమయంలో అసలు సమస్య ఎక్కడ వచ్చింది.. పరిష్కరించేందుకు ఏంచర్యలు తీసుకున్నాము వంటి వాటిపై సీఎంజగన్ సమీక్షచేయాల్సి ఉంది.కానీ ఇంత వరకూ అలాంటి సమీక్షేచేయలేదు. చివరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయాలు ఏం ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా జగన్ చేయడం లేదని తెలుస్తోంది. విద్యుత్ సమస్యపై సీఎంఇంత నిర్లక్ష్యంగా ఉండటంతో అధికారులకూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. చివరికి ఉన్నంత కరెంట్ ను సరఫరా చేసి.. మిగిలిన సమయంలో కోతలు విధిస్తే చాలని సరి పెట్టుకుంటున్నారు.
డిమాండ్‌కు ఉత్పత్తికి మధ్య అనూహ్యమైన తేడా ఉంది. నెలాఖరు వరకూ సమస్య ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఏపీ ప్రజలు.. పారిశ్రామిక రంగంతీవ్రంగా నష్టపోతుంది. అందుకే జగన్ వెంటనే సమీక్ష చేసి విద్యుత్ అందుబాటులోకి తెచ్చే మార్గాలపై అన్వేషణ చేయాలన్న వాదన వినపిిస్తోంది.కానీ సీఎంమాత్రం పట్టించుకునే పనిలో లేరు.