తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆంధ్రులను దశాబ్దాల పాటు దారుణంగా తిట్టిన కేసీఆర్‌ను.. జగన్మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి.. బీజేపీతో.. టీఆర్ఎస్తో ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణపై.. గతంలో వైఎస్ చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. హైదరాబాద్‌కు పాస్‌పోర్టులతో వెళ్లాల్సి వస్తుందని వైఎస్ అన్న మాటలను.. జగన్ మోహన్ రెడ్డి మర్చిపోయారా.. అని ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటోందని.. జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీద కోపం ఉంటే.. ఎన్నికల్లో పోటీ చేసి తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ” రండి.. పోటీ చేద్దాం… జనసేన, వైసీపీ, టీడీపీ పోటీ చేద్దాం… అంతే కానీ.. మధ్యలో బయట నుంచి కేసీఆర్‌ను ఎందుకు తీసుకు వస్తున్నారు…” అని జగన్‌ను నిలదీశారు.
కేసీఆర్‌కు కూడా.. పవన్ ఓ ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు. “రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఛీ కొట్టారు మమ్మల్ని. ఆంధ్రులు దుర్మార్గులన్నారు. రాష్ట్రం విడిపోయింది. ఇంకా ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు. ఇంకా ఎందుకు తెలంగాణ – ఆంధ్ర మధ్య గొడవలు. మీకు ..మీకు గొడవలు ఉంటే విడిగా చూసుకోండి. ప్రజల్ని ఎందుకు శిక్షిస్తున్నారు. దశాబ్దాల పాటు తిట్లు తిన్నాం. కేసీఆర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఆంధ్రుల్ని వదిలేయండి…” అని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ని గెలిపించాలని.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక సాయం చేయడమే కాదు.. డేటా చోరీ సహా.. వివిధ అంశాలో తెలంగాణ పోలీసుల్ని ఉపయోగించి ఆంధ్రపై కూడా తమకే పెత్తనం ఉందన్నట్లుగా.. కేసీఆర్ వ్యవహారించడం.. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. తమ ఆత్మగౌరవాన్ని జగన్, కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారనే భావం ప్రజల్లో ఏర్పడుతోంది. పవన్ కల్యాణ్ రాజమండ్రి ఆవిర్భావ సభలో ఇదే చెప్పారు.
కొన్నాళ్ల క్రితం.. జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి చేశారని పవన్ కల్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు.. నేరుగా.. మరోసారి ఏపీలో టీఆర్ఎస్ జోక్యంపై మండి పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సీఎం జోక్యం… పోలీసులతో పెత్తనం చేయాలనుకోవడంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది.. తెలంగాణ సెంటిమెంట్ ను మించేదిగా ఉందన్న అభిప్రాయం ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా.. టీఆర్ఎస్ సహకారంతో .. ఏపీలో రాజకీయ పోరాటం చేస్తున్నారని ప్రజలు నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. పదే పదే తెలంగాణ పోలీసుల వద్దకు జగన్మోహన్ రెడ్డి పరుగెత్తడం.. ఇదే సందని..తెలంగాణ పోలీసులు.. ఏపీని గుప్పిట పట్టాలని ప్రయత్నిస్తూండటంతో.. మొత్తానికే.. ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. అది పవన్ మాటల్లో వ్యక్తమయింది.