ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాసిన లేఖ ఆయనను అభాసుపాలు చేస్తోంది. పాలనాపరమైన అంశాల మీద పట్టు లేదని రూడీ చేయడమే కాకుండా చరిత్ర మీద కూడా జగన్ కు ఏమాత్రం అవగాహనా లేదని తాజాగా రాసిన లేఖ ద్వారా స్పష్టమైంది. ప్రధాన ప్రతిపక్ష నేతను ఎంపిక చేయడానికి ప్రత్యేకించి విధానం లేదని పేర్కొన్న జగన్ కు ఆ సలహా ఎవరిచ్చారో కానీ, ఆయన మాత్రం అడ్డంగా బుక్ అయ్యారు.
చరిత్రను ప్రస్తావించేటప్పుడు నిర్దిష్టమైన సమాచారాన్ని తెలుసుకొని వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మిడి, మిడి జ్ఞానంతో లేఖ రాసి జగన్ తన అవగహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. జగన్ రాసిన లేఖలోని కొన్ని అంశాలను చూస్తే జగన్ మరీ ఇంత సత్యదూరమైన అంశాలను లేఖలో ప్రస్తావిస్తాడనుకోలేదని పాత్రికేయులు సైతం ఖంగు తింటున్నారు. ఇప్పటికే తెగ ట్రోల్ అవుతోన్న జగన్.. తాజాగా ప్రతిపక్ష హోదాపై ఆయన అజ్ఞానం ట్రోలింగ్ స్టఫ్ గా మారింది.
గతంలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కించుకోకపోయినా.. పీజేఆర్ ను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని జగన్ లేఖలో ప్రస్తావించారు. కానీ వాస్తవం ఏంటంటే.. పీజేఆర్ ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గా గుర్తించలేదు. కాంగ్రెస్ శాసనా సభా పక్ష నేతగా మాత్రమే గుర్తించారు.అలాగే, గతంలో టీడీపీకి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని మరో అబద్దాన్ని పేర్కొన్నారు జగన్. ఇందిరా గాంధీ హయాంలో 1970 డిసెంబర్ నుంచి 1977 వరకు అసలు ప్రతిపక్ష నేత పదవి దక్కలేదు.
వాస్తవాలు ఇలా ఉంటే జగన్ మాత్రం ప్రతిపక్ష నేత హోదా దక్కించుకునేందుకు అబద్దాలను లేఖలో పేర్కొనడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అధికారం కోల్పోయినా ఇంకా అసత్యాలు, అర్దసత్యాలతో మోసం చేయాలనే జగన్ నైజం మారడం లేదని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.