ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కంట్రోల్ తప్పి పోయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రప్రజల్ని నానా తిప్పలు పెడుతున్న కరెంట్ కోతలపై ఆయన ఓ సమీక్ష చేయడం కానీ.. పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం కానీ చేయడం లేదు. అయితే చంద్రబాబు మీద.. ఇతరుల మీద అసభ్య పదజాలాన్ని ఉపయోగించి తిట్లను తిట్టడానికి మాత్రం సమయం కేటాయిస్తున్నారు. ఆర్బీఐ నుంచిరూ.రెండు వేల కోట్ల అప్పులు తెచ్చి.. అందులో రూ. వెయ్యి కోట్లను వసతి దీవెన కింద బటన్ నొక్కడానికి ప్రత్యేకంగా నంద్యాలలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రసంగించిన సీఎం జగన్ అసహనంతో ఊగిపోయారు.
చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని..నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ యాక్షన్ చేసి మరీ చూపించారు. దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకొన్న ఖర్మ దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో… ఈ స్థానానికి వచ్చా… వీళ్ళందరూ కలిసి నా వెంట్రుక కూడా పీకలేరుకర అని వ్యాఖ్యానించారు. జగన్ తీరు చూసి సభికుల్లోనూ ఆశ్చర్యం వ్యక్తమయింది. జగన్ ఎందుకింత అసహనానికి గురవుతున్నారన్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
ప్రజల సమస్యను పట్టించుకోకుండా కేవలం పథకాలకు మీటలు నొక్కితే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని జగన్ భావిస్తున్నారు. అయినా ఎందుకిలా అసహనానికి గురవుతున్నారో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. ఓట్లు చీలనివ్వబోనని పవన్ ప్రకటించిన తర్వాత జగన్‌లో మరింత అసహనం కనిపిస్తోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు ప్రజాసమస్యలను పట్టించుకోకుండా సీఎం ఇలా రాజకీయాలు చేస్తే ప్రజలే పీకేస్తారని కొంత మంది గుర్తు చేస్తున్నారు.