ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటివరకు అమరావతి, పోలవరం, విద్యుత్, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రాలను విడుదల చేశారు. వైసీపీ హయాంలో జరిగిన లోటుపాట్లను విశదీకరిస్తూ వైసీపీ విధ్వంస పాలనను ప్రజలందరికీ వివరించారు.
వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల దోపిడీ వ్యవహారమంతా శ్వేతపత్రాల ద్వారా బయటకొస్తుండంతో ప్రజలంతా నోరెళ్ళబెడుతున్నారు. సంక్షేమం మాటున ఇంత పెద్దఎత్తున దోపిడీ చేశారా..? అని షాక్ అవుతున్నారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం శ్వేతపత్రాలు అంతా డొల్ల అని చెప్పే సాహసం కూడా చేయడం లేదు.
Also Read : అదేం తిక్క.. ఇదేం లెక్క.. జగన్?
పోలవరంపై బాబు శ్వేతపత్రం విడుదల చేయగానే రంగంలోకి దిగిన అంబటి రాంబాబు..ఏదేదో మాట్లాడారు. పోలవరం అనే సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదని చెప్పడం ట్రోల్ అయింది. ఆ తర్వాత అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రాలు బయటకు వచ్చినా వైసీపీ నేతలు కిక్కురుమనలేదు. దీంతో చంద్రబాబు శ్వేతపత్రాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
వైసీపీది విధ్వంస పాలన అనేలా చంద్రబాబు పక్కా ఆధారాలతో శ్వేతపత్రాలు విడుదల చేస్తుండటంతోనే కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ సాహసించడం లేదని తెలుస్తోంది.