తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో పరిణామాలు రేవంత్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయనకు చెక్ పెట్టడానికి సీనియర్లు ఎన్నో విధాలుగా చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కీలక పదవుల్ని తెచ్చుకుంటున్నారు. కానీ వారి తీరు వల్ల ఆ పదవులన్నీ అలంకార ప్రాయమే అవుతున్నాయి. వారి పనులు కూడా రేవంత్ రెడ్డే చేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి నేతృత్వంలో చేరికల కమిటీని నియమించారు. జానాను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వచ్చిన సమయంలో మణిగం ఠాగూర్ ప్రత్యేకంగా కల్పించుకుని ఈ పదవిని సృష్టించి ఆయనకు ఇచ్చారు.
అయితే జానారెడ్డి నేతృత్వంలోని ఆ చేరిక కమిటీ ఇంత వరకూ ఒక్క సారి అయినాసమావేశం అయిందో లేదో ఎవరికీ తెలియదు. ఇంకా చెప్పాలంటే.. అసలు ఆ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత చాలా చేరికలు కాంగ్రెస్లో చేరాయికానీ.. ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ జానారెడ్డి కమిటీకి సంబంధం లేకుండా పోయింది. చేరికలన్నీ రేవంత్ రెడ్డి ప్రైవేటుగా ఏర్పాటు చేసుకున్న టీం పర్యవేక్షిస్తోంది. దీంతో సీనియర్లు మరోసారి వెనుకబడిపోయారు. నిజానికి ఇలాంటి పదవి వచ్చినప్పుడు.. జానారెడ్డి ఇద్దరు, ముగ్గుర్ని చేర్పించేసి ఉంటే ఆయన కమిటీకి కాస్త విలువ వచ్చేది. కానీ ఇప్పుడది లేకండా పోయింది.
ప్రజల్లో పలుకుబడి ఉన్న ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నా ఆయా జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలే అడ్డుపడుతున్నారని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. దీంతో చేరికల జాబితాలను నేరుగా తనకే ఇవ్వాలని రాహుల్ గాంధీ రాష్ట్రనాయకత్వానికి సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ వర్గీయులు చేస్తున్న చేరికల హడావుడి రాహుల్ కు తెలుసో లేదో స్పష్టత లేదని.. అంటున్నారు. కానీ జాారెడ్డి కమిటీ వైపు నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాకపోవడం.. ఆ పార్టీ నేతల్ని కూడా ఆలోచింప చేస్తోంది.