ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ పోవాలి బీజేపీ రావాలని .. జేపీ నడ్డా పిలుపునిచ్చారు. రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆయన ప్రసంగించారు. ఏపీని వైఎస్ఆర్సీపీ నాశనం చేస్తోందని మండిపడ్డారు. మాతృభాషను నిర్వీర్యం చేస్తున్నారని వ్యాపార వ్యతిరేక రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని… అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు. ఆలయాలపై దాడులు చేస్తున్నారని… శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకే జగన్ పనిచేస్తున్నారని… కానీ తమను ఆపలేరని నడ్డా సవాల్ చేశారు. జేపీ నడ్డా ఇంకా చాలా మాట్లాడారు కానీ అసలు జనసేన ప్రస్తావన కూడా తీసుకు రాలేదు.
బీజేపీ రావాలన్నారు కానీ.., బీజేపీ – జనసేన రావాలని చెప్పలేదు. పరిస్థితి చూస్తూంటే… అసలు బీజేపీతో జనసేన పొత్తులో ఉందా లేదా అన్న సందేహం రావడం ఖాయం. రెండు పార్టీలు ఏం చేసినా కలిసి పనిచేస్తాయన్నట్లుగా మొదట్లో మాట్లాడుకున్నారు. తర్వాత ఎక్కడా కలవలేదు. పవన్ కల్యాణ్‌ను.. జనసేనను పని చేయనివ్వలేదు. ఇప్పుడు ఆయనను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. కనీసం జనసేన పును కూడా ఆ పార్టీ అగ్రనేతలు ప్రస్తావించడానికి సిద్ధపడట లేదు. మరో వైపు జాతీయ నేతలతోనే తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పవన్ చెబుతున్నారు.
జనసేన బీజేపీ ప్రబు్తవం రావాలని ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓట్లు చీలనివ్వబోమని చెప్పిన తర్వాత బీజేపీ నేతలు దూరమవుతున్నట్లుగా కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్‌ను నిర్వీర్యం చేసేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై జనసేన వర్గాలు ఎలా స్పందిస్తాయన్నదానిపై తదుపరి రాజకీయం ఆధారపడి ఉంటుంది.