బెంగాళూరు విషయంలో ఇటీవల దూకుడుగా వ్యతిరేక ప్రచారం చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను అక్కడి ప్రభుత్వం రెచ్చగొడుతోంది. బెంగళూరులో మౌలిక సౌకర్యాలు తక్కువని అదే హైదరాబాద్‌లో చాలా ఉన్నాయని వచ్చేయాలని కేటీఆర్ పిలుపునిస్తున్నారు. పదే పదే అలాంటి వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. తాజాగా ప్రభుత్వం కూడా కేటీఆర్‌కు కౌంటర్లు ప్రారంభించింది. ఇటీవల కేటీఆర్ బెంగళూరుపై ఏ వ్యాఖ్యలు చేయకపోయినా తాజాగా కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది.
హలో కేటీఆర్ అంటూ కర్ణాటక డెవలప్మెంట్ ఇండెక్స్ ఓ ట్వీట్ చేసింది. రాష్ట్రానికి రెండు భారీ కంపెనీలు వచ్చాయని చెబుతూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసింది. కర్ణాటకలో 11 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయని తెలిపింది. బ్యాటరీ కంపెనీ ఎక్సైడ్ ప్లాంట్ కూడా ఏర్పాటు కాబోతుందని పేర్కొంది. సెటైర్ వేస్తున్నట్లుగా ట్వీట్ చేయడంతో కలకలంరేగింది.
హైదరాబాద్‌కు వచ్చిన పెట్టుబడుల వివరాలను కేటీఆర్ ట్వీట్ చేసి రిప్లయ్ ఇస్తారు. బెంగళూరు అంతవస్తాయా.. తక్కువ వస్తాయా అన్నది కాదు కానీ రెండు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కేటీఆర్ కోరుతున్నారు. హలాల్, హిజాబ్ లాంటి వివాదాలు కాదని పెట్టుబడుల్లో పోటీ పడదామని ఆయన సూచిస్తున్నారు.