జాతీయ పార్టీ అయిన తర్వాత జాతీయ పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా జరపాలని అనుకున్న కేసీఆర్ పూర్తిగా చల్లబడిపోయారు. సాదాసీదాగా ఆపీసును రిబ్బన్ కటింగ్ చేసి.. వెంటనే హైదరాబాద్ బయలుదేరి వచ్చేశారు. కేసీఆర్ అసలు ఢిల్లీలో ఉండేందుకే ఇష్టపడకపోవడం ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
నిజానికి రెండో తేదీనే ఆయన ఢిల్లీ వెళ్లాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణఆలతో ఆగిపోయారు. ఢిల్లీలోల పలు కీలక సమావేశాలు నిర్వహిస్తారని.. మేధావులతో చర్చలు జరుపుతారని.. పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో .. జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని అనుకున్నారు. కాన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే రోజు అయిన నాలుగో తేదీ ఉదయం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. తన చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించి.. లంచ్ సమయం అయిన వెంటనే వెనుదిరిగారు.
ఎవరితోనూ సమావేశం కాలేదు. మామూలుగా గురువారం అంతా కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఢిల్లీలో ఉండాలనుకోలేదు. ఈ సారి ఏ ఒక్క ఇతర పార్ట నేతను కూడా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు. ఇంకా చెప్పాలంటే అసలు మీడియాను కూడా పిలువలేదు. వచ్చిన మీడియాను కూడా రోడ్డు మీదకు గెంటేశారు. వారిచ్చిన ఫీడ్ మాత్రమే మీడియా సంస్థలు తీసుకున్నాయి.
మామూలుగా ఢిల్లీ వచ్చి దడదడలాడిస్తానని కేసీఆర్ చెబుతూ ఉంటారు. కానీ ఆయన అక్కడ ఉండటానికి కూడా ఇబ్బంది పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసలు పార్టీ విస్తరణ గురించే ఇటీవలి కాలంలో పెద్దగా మాట్లాడటం లేదు.