ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుక బడిందని.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఏపీ వైపు పోవడం లేదని అంతా.. తెలంగాణలో అభివృద్ధి ఉందని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు తరచూ సెటైరిక్‌గా చెబుతున్నారు. మామూలుగా రాజకీయ ప్రకటనలు అయితే..పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో. బిజినెస్ మీటింగ్స్‌లో …అసెంబ్లీ సమావేశాల్లో.. కేసీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లు నవ్వుతూ చెబుతున్నారు. దీంతో ఆంధ్రలో చర్చ ప్రారంభమవుతోంది. అసెంబ్లీలో కేసీఆర్… తెలంగాణలో ఎకరం విలువ.. ఏపీలో రెండు ఎకరాలతో సమానమని.. చెప్పారు. గతంలో ఏపీలో ఎకరం అమ్మి తెలంగాణలో నాలుగైదు ఎకరాలు కొనేవాళ్లు అయితే ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మి ఏపీలో రెండు ఎకరాలు కొంటున్నారని చెప్పారు. అంటే దీనర్థం… ఏపీలో భూముల విలువతో పోలిస్తే తెలంగాణ రెండింతలు ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ చెప్పదల్చుకున్నారు.
అదే సమయంలో గతంతో పోల్చడంద్వారా.. ఏపీ పూర్తిగా డౌన్ అయిందనే సంకేతాన్ని కూడా పంపారు. కేసీఆర్ మాటలు ఇప్పుడు.. ఏపీ ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. నిజంగానే రెండేళ్ల కిందటి పరిస్థితితో పోల్చి చూసుకుని అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే కాదు.. భూముల విలువ పెరుగుతాయని ఆశలు పెట్టుకున్న సాధారణ జనం కూడా నిట్టూరుస్తున్నారు. కేసీఆర్ ఏపీ వెనుకబడిందని ఇలా అనడం ఇదేమొదటి సారి కాదు.. చాలా సార్లు అన్నారు. హరీష్ రావు కూడా ఆర్థిక మంత్రి హోదాలో తెలంగాణలో వ్యాపారాల్ని ప్రోత్సహించడానికి ఏపీ పరిస్థితుల్ని పలుమార్లు ఉదాహరమగా చూపించారు. ” ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారుగా..?..” అంటూ… ఓ రియల్ ఎస్టేట్ ఓనర్ల సమావేశంలో సెటైర్ వేశారు.
ఈ మాట అన్నవెంటనే.. ఎదురుగా ఉన్న రియల్టర్లు అందరూ భళ్లున నవ్వేశారు. అంటే ఏపీలోవ్యాపారం అంటే కామెడీ అనే పరిస్థితి వచ్చిందని ప్రజలు అప్పుడే నిట్టూర్చారు. ఏపీలో వ్యాపారాలు దెబ్బతింటే మొదటగా లాభపడేది హైదరాబాదేనని…. రియల్ఎస్టేట్ రంగాలు చెబుతూ ఉంటాయి. అదే సమయంలో తెలంగాణలో సాగునీటి వనరులు మెరుగుపడ్డాయి. ఈ కారణంగా తెలంగాణలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ ఏపీలో రాజకీయపరిస్థితుల వలన పడిపోయాయి.ఇదే విషయాన్ని తమ ప్రజలకు గుర్తు చేసి… వారి మన్ననలు పొందడానికి కేసీఆర్, హరీష్ రావులాంటి వాళలు పదే పదే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారని అంటున్నారు.