లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యంతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు ఆమెను ఎయిమ్స్ కు తీసుకెళ్లి భర్త అనిల్ సమక్షంలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.
Also Read : వాళ్లపైనే ఆశలన్నీ పెట్టుకున్న బీఆర్ఎస్!
కవిత భారీగా వెయిట్ లాస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న కవితను పరామర్శించేందుకు కేటీఆర్ , హరీష్ రావులు సోమవారం ఢిల్లీ వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఇదే కవితకు సంబంధించి ఓ విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు. కవిత అరెస్ట్ అయి నాలుగు నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు తల్లి శోభ, అన్నయ్య కేటీఆర్, హరీష్ రావు, పార్టీ నేతలు ఆమెను పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లి వచ్చారు. కానీ , ఇంతవరకు కవిత కోసం ఒక్కసారి కూడా కేసీఆర్ ఢిల్లీ వెళ్ళలేదు.
Also Read : కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న కేటీఆర్!
కనీసం ఆమె అనారోగ్యానికి గురైందని తెలిసాక కూడా కేసీఆర్ పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లకపోవడం చర్చనీయంశం అవుతోంది. అయితే, కవిత ఏకంగా పదికిలోల బరువు తగ్గారని టాక్ నడుస్తోంది. కూతురు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇప్పటికైనా కేసీఆర్ ఆమెను చూసేందుకు వెళ్తారో లేదో చూడాలి.