కేసీఆర్ ఆ నలుగురు ఎమ్మెల్యేల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వారు బయట కనిపించడం అరుదైపోయింది. కనిపిస్తే కేసీఆర్‌తోనే కనిపిస్తున్నారు. ఫామ్‌హౌస్ డీల్స్ వ్యవహారంలో పోలీసులు ఎంటరైన తర్వాత నలుగురు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆ తరవాత వారికి భద్రత పెంచారు. కానీ నియోజకవర్గాలకు మాత్రం వెళ్లడంలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నారని చెబుతున్నారు కానీ ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. బయట కనిపిస్తే మాత్రం కేసీఆర్‌తోనే వస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నిక ముగిసిన రోజున కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ వచ్చారు. తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. తర్వాత వారు బయటకు కనిపించలేదు. కానీ తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వారు పోలీసు కేసులు పెట్టారు. ఇప్పుడు మరోసారి వారు టీఆర్ఎస్ భవన్లో జరిగిన సర్వసభ్య సమావేశానికి వచ్చారు. అయితే వారు ఎవరికి వారుగా రాలేదు. కేసీఆర్ కాన్వాయ్‌లోనే నలుగురూ వచ్చారు. దీంతో వారు ఇంకా ప్రగతిభవన్లోనే ఉన్నారా అన్న సందేహం చాలా మంది నేతలకు వస్తోంది.
ప్రస్తుతం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. రోహిత్ రెడ్డి వద్ద సిట్ అధికారులు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగతా ముగ్గురివి చేసుకుంటారో లేదో స్పష్టత లేదు.త కానీ ఈ నలుగురిని మాత్రం వీలైనంతగా బయట కనిపించకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటో తెలియదు కానీ.. వారి నియోజకవర్గాల్లో మాత్రం భిన్నమన ప్రచారం జరుగుతోంది.. అక్కడి క్యాడర్ ఎమ్మెల్యేల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.