ఏపీ రాజకీయాలపై కేటీఆర్ తన స్ట్రాటజీ మార్చుకున్నారు. ఏపీ ఎన్నికల్లో తమ పాత్ర ఏమీ ఉండదని ప్రకటించారు. గతంలో ఎప్పుడు మాట్లాడినా.. చంద్రబాబు ఓడిపోతారని..కచ్చితంగా జగన్ సీఎం అవుతారని.. ఘంటా పథంగా చెప్పే.. కేటీఆర్ ఇప్పుడు.. ఒక్క సారి.. ఏపీ ఎన్నికల్లో తమ పాత్రేమీ ఉండదని చెప్పుకొస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో.. ఏపీలో ప్రచారానికి వెళ్లడం లేదని చెప్పారు కానీ.. ఏపీ ప్రజలకు ఓ సందేశం మాత్రం ఇవ్వాలనుకుంటున్నామని.. ఎప్పుడు.. ఎలాంటి సందేశం ఇస్తారనేది.. కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. ఇప్పుడు తమ పాత్రేమీ ఉండదని నేరుగా చెబుతూండటంతో.. ఆ సందేశం కూడా.. టీఆర్ఎస్ వైపు నుంచి వచ్చే అవకాశం లేదు. ఈ మార్పు ఎందుకు..?
ఇస్తున్న రిటర్న్ గిఫ్టులన్నీ వేలు పెట్టడం కాదా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో… టీఆర్ఎస్ ప్రధాన ప్రచారాస్త్రం.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి .. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా.. ఆ పార్టీ నేతలందరూ.. చంద్రబాబు.. తెలంగాణపై దండయాత్రకు వచ్చినట్లుగా ప్రచారం చేశారు. ఆ ఫలితం ఎన్నికల్లో కనిపించింది. అయితే.. ఆ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా… తానే నేరుగా విజయవాడకు వచ్చి .. చంద్రబాబు గురించి చెబుతానని ప్రకటించారు. కేటీఆర్ సైతం.. ఏపీలో తమకు ఫ్యాన్స్ ఉన్నారన్నారు. వారి కోసం ఏపీకి వస్తామన్నారు. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు లాంటి టీఆర్ఎస్ నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇదంతా.. చంద్రబాబుకు ఇస్తామన్న రిటర్న్ గిఫ్ట్‌లో భాగమేనని..రాజకీయ వర్గాలు గట్టిగానే ఓ అంచనాకు వచ్చాయి.
వైసీపీకి ఆ సహకారం ఏ కోణం లోనిది..?
రిటర్న్ గిఫ్ట్‌లో భాగంగా… జగన్‌కు ఇప్పటికే.. పూర్తి స్థాయి సహకారాన్ని టీఆర్ఎస్ అందిస్తోంది. తెలంగాణ పోలీసులు… వైసీపీకి పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నారు. ఏపీ రాజకీయాల్ని తెలంగాణ నుంచి కంట్రోల్ చేయడానికి పోలీసుల్ని ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వచ్చాయి. షర్మిల ఫిర్యాదు, డేటా చోరీ వంటి అంశాల్లో .. తెలంగాణ పోలీసులు చేసిన హడావుడే దీనికి నిదర్శనం అంటున్నారు. అంతే కాదు మాట కంటే ముందు.. వైసీపీ నేతలు.. కంప్లైంట్లు పట్టుకుని… తెలంగాణ పోలీసుల వద్దకెళ్లడం.. వాళ్లు రాజకీయ ప్రకటనలు చేయడం కామన్ గా మారిపోయింది. డేటా చోరీ కేసులో.. విజయసాయిరెడ్డి.. తెలంగాణ పోలీసులను ఆదేశిస్తున్నట్లుగా తయారు చేసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ బయటపడటంతో అసలు గుట్టు బయటపడినట్లయింది. ఈ క్రమంలోనే కేటీఆర్.. ఏపీ రాజకీయాలపై తన వాయిస్ డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. లోక్‌సభకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్.. తొలి ప్రచారసభలో.. ఆశ్చర్యకరంగా.. చంద్రబాబుపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పూర్తిగా చంద్రబాబునే ప్రచారాస్త్రంగా చేసుకున్న టీఆర్ఎస్ ఈ సారి మాత్రం వ్యూహం మార్చింది. చంద్రబాబు తనను మూడు నెలల్లో మూడు వేల తిట్లు తిట్టారని మాత్రం చెప్పారు.
ఏపీలో సెంటిమెంట్ పెరిగిందని భయపడుతున్నారా…?
టీఆర్ఎస్ ఏపీ ఎన్నికల విషయంలో ఒక్క సారిగా తమ పాత్రేమీ లేదని చెప్పుకోవడానికి ప్రధాన కారణంగా… ఏపీలో సెంటిమెంట్ పెరుగుతోందన్న అంచనాకు రావడమేనని అంటున్నారు. తమ దూకుడుతో ఏపీలో సెంటిమెంట్ పెరిగిందన్న అంచనాకు వచ్చారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇప్పటికే.. అనేక అంశాల విషయంలో.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు ఉన్నాయి. పోలవరంపై పిటిషన్లు.. దిగువ రాష్ట్రం అయినా సముద్రంలోకి పోతున్న నీరు వాడుకున్నా అభ్యంతరాలు చెప్పడం, కరెంటు బకాయిలు, ఉమ్మడి సంస్థల విభజన ఇలాంటి వన్నీ తెరపైకి వస్తున్నాయి. దీంతో.. ప్రజల్లో… చంద్రబాబును ఓడించడానికి కేసీఆర్ ఎందుకు ఇంతగా ప్రయత్నిస్తున్నారనే చర్చ ప్రారంభమయింది. ఇది ఇంకా పెరిగితే… మొత్తానికే మోసం వస్తుందని.. అసలైన గిఫ్ట్ చంద్రబాబుకు ఇచ్చినట్లవుతుందన్న ఉద్దేశంతో.. వెనక్కి తగ్గిట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
జగన్ గెలిస్తే ఎంపీ సీట్లు టీఆర్ఎస్ ఖాతాలోకేగా..?
ఏపీలో వైసీపీకి వచ్చే పార్లమెంట్ సీట్లన్నీ… దాదాపుగా… టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్తాయి. అక్కడ్నుంచి బీజేపీకి మద్దతుగా మారుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎంపీ అభ్యర్థుల విషయంలో.. కేసీఆర్ నేరుగా కల్పించుకున్నారని.. వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీ నేతల్ని బెదిరించి మరీ ఆ పార్టీలో చేర్చుడం వెనుక ఇదే స్ట్రాటజీ ఉందంటున్నారు. ఇప్పుడు సెంటిమెంట్ పెరిగితే మొత్తానికే మోసం వస్తుందని.. తమ స్వభానానికి విరుద్ధంగా .. ఏపీ ఎన్నికల్లో తమ పాత్రేమీ ఉండదంటున్నారు. కానీ రాజకీయంగా… ఏపీ ఓటర్లు చాలా తెలివైన వారనే విషయం.. మే 23న తేలిపోవచ్చు.