పార్టీ నేతలు వరుసగా పార్టీలు మారిపోతూంటే..కేటీఆర్ కేవలం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఫామ్ హౌస్ లోనూ కనిపించడం లేదు. రెండు రోజులుగా ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కేసీఆర్ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కు పిలుస్తున్నారు. వారితో పాటు హరీష్ రావు ఉంటున్నారు కనీ కేటీఆర్ కనిపించడం లేదు. కేటీఆర్ బహిరంగంగా పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. కానీ హెవీ వెయిట్ ట్వీట్స్ మాత్రం పెడుతున్నరు.
ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కేసీఆర్ పార్టీ నేతల్ని కలిసేందుకు పెద్దగా ఆసక్తిగా లేరు. ఆయన వ్యవసాయం మీద దృష్టి పెట్టారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉన్న వారిని వదిలేశారని అనుకుంటారని.. ఫామ్ హౌస్ గేట్లు తెరుస్తున్నారు. ఇలాంటి సీరియస్ సిట్యూయేషన్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేటీఆర్ ఎందుకు ప్రయత్నించడం లేదన్నది బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్లో పోరాటం చేయడమే ప్రస్తుతం రాజకీయం అని కేటీఆర్ భావిస్తుున్నట్లుగా ఉన్నారు. కానీ ఇప్పుడు అది సరిపోదని పార్టీ క్యాడర్ భావిస్తోంది. కామ్ గా ఉంటే కాంగ్రెస్ పై అదే వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటున్నారు. కానీ రాజకీయాల్లో కష్టపడకుండా ఫలితం రాదని నేతలు అనుకుంటున్నారు.