నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ ని గుంటూరులోని బ్రోడీపేట్ లో జరిగిన ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు భారీగా హాజరయ్యారు. రారా రెడ్డి పాటలోని ‘రానురాను అంటుంది చిన్నదోయ్’ పాపులర్ బిట్ కి నితిన్ తో పాటు కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, అనిల్ రావిపూడి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఈవెంట్ లో దాదాపు టీం అంతా పాల్గొంది. ఐతే దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం మిస్సింగ్. ఆయన ఈవెంట్ కి రాలేదు. ఆయన రాలేదో కావాలనే తప్పించారో తెలీదు.
ఇటివలే రాజశేఖర్ రెడ్డి ట్విట్టర్ లో రెండు కులాలని కించపరుస్తూ చేసిన కొన్ని వివాదాస్పదమైన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఐతే ఇదంతా తప్పుడు ప్రచారమని, కావాలనే తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ కేసు కూడా పెట్టాడు రాజశేఖర్. ఐతే అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. మాచర్ల పై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఐతే తాజా ఈవెంట్ లో రాజశేఖర్ కనిపించలేదు. నితిన్ కూడా ఆయన పేరుని ప్రస్థావించలేదు. పాటకి కోరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ కి థాంక్స్ చెప్పాడు కానీ దర్శకుడు రాజశేఖర్ ఊసే ఎత్తలేదు.
దర్శకుడి పేరు తీసుకురాకపోవడానికి కారణం .. నితిన్ వ్యూహాత్మక మౌనమే అనుకోవాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ట్వీట్స్ రెండు బలమైన కులాలని ఉద్దేశించినవి. ప్రస్తుతం థియేటర్ల కి అసలు జనమే రాని పరిస్థితి. ఇలాంటి సమయంలో అనవసరమైన వివాదాలు జోలికిపొతే మొదటికే మోసం వస్తుంది. అందుకే అటు నిర్మాత సుధాకర్ రెడ్డి గానీ ఇటు నితిన్ గానీ అసలు దర్శకుడి పేరుని ప్రస్థావించకుండానే కార్యక్రమాన్ని ముంగించేశారనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.