శుక్రవారం విడుదలైన ‘యానిమల్’పై మిక్డ్స్ టాక్ వినిపిస్తోంది. అయితే తొలి రోజు ఈ సినిమా మంచి వసూళ్లు అందుకొంది. శని, ఆదివారాలు కూడా ఇదే మూడ్ కొనసాగే ఛాన్సుంది. బాక్సాఫీసు ఫలితం పక్కన పెడితే.. ‘యానిమల్’ విషయంలో రకరకాల డిస్కర్షన్స్ వినిపిస్తున్నాయి. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హద్దులు మీరిపోయాడని, అవుటాఫ్ ది బాక్స్ పేరుతో.. ఓవర్ ది బోర్డ్ ఐడియాల్ని చలామణీలోకి తెచ్చాడని విమర్శిస్తున్నారు.
ఓ సీన్లో హీరోని న్యూడ్ గా చూపించాడు. నిజానికి ఆ అవసరం కథలో లేదు. రణబీర్ కపూర్ చాలా రిస్క్ తీసుకొని ఆ సీన్ చేశాడు కానీ, మరో హీరో అయితే కచ్చితంగా ‘నో’ చెప్పేవాడు. నిజానికి ఈ కథ ముందు మహేష్ బాబు దగ్గరకు వెళ్లింది. హీరో న్యూడ్ గా కనిపించే సీన్ పైనే మహేష్ అభ్యంతరం చెప్పాడని, ఆ సీన్ మార్చడానికి సందీప్ రెడ్డి వంగా ఒప్పుకోకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదని తెలుస్తోంది. నిజానికి అదొక్కటే కాదు. మహేష్ చేయడానికి ఇబ్బంది పడే సీన్లు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. మహేష్ గనుక ఈ సినిమా చేస్తే అది మరింత డ్యామేజింగ్ ఫ్యాక్టర్ అయ్యుండేది. ఈ సినిమా మహేష్ వదులుకొని మంచి పనే చేశాడు.