సంఘసేవ చేయడానికి తిరుపతి వచ్చానని రెండు రోజుల ముందు ప్రకటించిన మనోజ్ ..రెండో రోజు … తన పయనంపై.. మరో సోషల్ మీడియా పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకోమని తన అన్న కుమారుడు రామ్ చరణ్ ను అడిగిన పవన్ కల్యాణ్‌ను… అలాగే…. బాబాయ్ విజ్ఞప్తిని అంగీకరించి తీసుకుంటాన్న అబ్బాయ్ నిర్ణయాన్ని ఏక కాలంలో పొగిడేస్తే.. ఓ పోస్ట్ పెట్టేశారు. హీరో రామ్‌చరణ్ మంచి మనుసును చూస్తుంటే మజోన్కు గర్వంగా ఉందట. చరణ్ సోదరిడిగా గర్వపడుతున్నారట. గ్రామాన్ని దత్తత తీసుకోవడం చాలా మంచి పని. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం మన నుంచే ప్రారంభంకావాలని సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు.
మనోజ్‌కి చరణ్ -పవనే కనిపించారా..?
సిక్కోలు ప్రజల కోసం.. కొన్ని వేల మంది ఉద్యోగులు..మరెన్నో స్వచ్చంద సంస్థలు పని చేస్తున్నాయి. నిఖిల్ లాంటి హీరో… సంపూర్ణేష్ లాంటి నటుడు కూడా… క్షేత్ర స్థాయికి వెళ్లి తమ వంతు సాయం అందించి వచ్చారు. అల్లు అర్జున్ పాతిక లక్షలు క్యాష్ ఇచ్చారు. ఇక నందమూరి కుటుంబం కూడా విరాళాలు ప్రకటించారు. వీరందరూ చేసినది.. మంచు మనోజ్‌కి మంచిగా కనిపించలేదా..? కేవలం.. బాబాయ్ – అబ్బాయ్ ల వ్యవహారమే… మంచికి ప్రారంభంగా తోచిందా..?. అంత మంచి అయితే.. సంఘసేవ చేస్తానంటూ బయలుదేరిన.. మంచు మనోజ్.. శ్రీకాకుళం పోయి.. ఓ విలేజ్ ను దత్తత ఎందుకు తీసుకోవడం లేదు..? ఇలాంటి పరి పరి విధానాలు అనుమానాలు అందిరకీ రావడం సహజమే.
జనసేనలో చేరేందుకు రూట్ మ్యాపా..?
మరి ఎందుకు… ఒక్క పవన్ – చరణ్ ను మాత్రమే పొగిడారంటే.. దీని వెనుక అందరూ ఊహించుకోగలిగిన చిన్న పొలిటికల్ లాజిక్ ఉండొచ్చు. ఎందుకంటే.. మంచు మనోజ్ కి సినిమాల్లేవు. గౌరవంగా చెప్పుకోవాలంటే.. ఆయన సినిమాల నుంచి తాత్కాలిక రిటైర్మెంట్ తీసుకున్నారు. సంఘసేవ చేయాలనుకున్నారు. ఇది ఎన్నికల సమయం అని సంఘసేవ గుర్తుకు వచ్చిందో… లేక… ఇంకేదైనా కారణమో ఆయనకే తెలియాలి. దానికే.. తిరుపతికి మకాం మారుస్తున్నానని ప్రకటించారు. సంఘ సేవ అంటే సొంత డబ్బుల్ని పెట్టి చేసేంత ధన వంతులు కాదు వాళ్లు. అని అని .. సేవ చేస్తామంటే అందరికీ పళ్లు తోమిపెట్టలేరు. సేవ చేయాలంటే.. రాజకీయం చేయాలి. అది.. అదే రాజకీయం కోసం తిరుపతి పోతున్నారు. మరి ఫ్లాట్ ఫాం. టీడీపీ, వైసీపీల్లో ఖాళీల్లేవు. ఉంటే ఈ పాటికి.. మనోజ్‌ను కాదు.. ఆయన తండ్రిని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి ఉండేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఎదురుగా.. కనిపిస్తోంది జనసేన.
మనోజ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
ఇంకేముంది.. ఆ పార్టీ దగ్గరకు చేరుకునేందుకు సోషల్ మీడియా వేదికగా… గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. టిట్లీ తుపానులో బాబాయ్ – అబ్బాయ్ ల… విలేజ్ దత్తత సీన్ ఆధారంగా.. ఆయన అల్లుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయం పవన్ కల్యాణ్ కు తెలుస్తుందా..? మనోజ్ కు తన పార్టీకిలో చాన్సిస్తారా..? లేక.. మనోజ్ సినిమా కెరీర్లానే ఇది కూడా అయిపోతుందా..? . సినిమా ఫలితం ఫస్ట్ షోలో తెలిసిపోతుందేమో కానీ.. పొలిటికల్ ఫలితం మాత్రం… పూర్తిగా ఆరిపోయిన తర్వాతే తేలుతుంది. రాగిసంగటి, నాటుకోడి పులుసైనా మిగులుతుందో లేదో.. !
— సుభాష్