ఆదివారం తన ట్వీట్లతో హోరెత్తించాడు కీరవాణి. ఆయన జోరు చూస్తుంటే… `రిటైర్మెంట్ స్పీచ్`లా అనిపించింది. నా రిటైర్మెంట్ కోసం చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారంటూ..తమన్‌పై కౌంటర్లు వేశాడు. దర్శకులకు బుర్ర లేదన్నాడు. తన తోడున్నంత వరకూ రాజమౌళిని ఎవ్వరూ అందుకోలేరన్నాడు. తెలుగు సినిమాసాహిత్యం పడకేసిందని విమర్శించాడు. క్రాంతికుమార్, రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మ ఇలాంటి వాళ్లందరినీ పొగిడేశాడు. ఇలా… చాలా చాలా ట్వీట్లు చేశాడు. అయితే…మళ్లీ ఆన్‌లైన్‌లోకి వచ్చి.. ‘రిటైర్మెంట్ ఇప్పట్లో లేదు.. నా అభిరుచులకు అనుగుణంగా పనిచేస్తా’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.
కీరవాణిలాంటి లబ్ద ప్రతిష్టుడు ట్వీట్లతో తన ఆవేదన, అంతరంగాన్నీ ఆవిష్కరించడం వరకూ బాగానే ఉంది. కానీ.. దర్శకుల్ని, రచయితల్ని, నిర్మాతల్ని టార్గెట్ చేయడం, మరో సంగీత దర్శకుడు (తమన్) గురించి మాట్లాడడం ఏం బాలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కీరవాణి రిటైర్ ఏం అవ్వలేదు. చూస్తుంటే ఆ ఉద్దేశమే లేనట్టు కనిపిస్తోంది. అలాంటప్పుడు ఇంతలా ఆవేశ పడడంలో అర్థం ఏముంది?? తెలుగు సినీ సాహిత్యం పడకేసిందన్నారాయన. మరి తన పాటల్లో `బూతు`లు వినిపించలేదని గ్యారెంటీ ఇస్తారా? సింహాద్రి, ఛత్రపతి సినిమాల్లో పాటలు తెలుగు సాహిత్యాన్ని బ్రతికించాయన్న భావం ఆయనలో ఉందా? ఏ వచ్చి బీపై వాలి, బీ వచ్చి సీపై వాలి సీ వచ్చి డీపై వాలిందే… అనే పాటకు నిజంగా అర్థం ఉందని ఆయన భావిస్తున్నారా? నీ గుర్రం కోసం పెంచానేనే వెచ్చనైన గడ్డీ?? అనే పాటలతో తెలుగు సాహిత్యాన్ని ఏమైనా ఆయన బతికించారా?
నా తోడు ఉన్నంత వరకూ రాజమౌళిని ఎవ్వరూ కొట్టలేరు అంటే అర్థం ఏమిటి? రాజమౌళి బలం కీరవాణి అనే కదా? కీరవాణి లేకపోతే రాజమౌళి లేడనా? నా మాట విన్నాడు కాబట్టే, రాజమౌళి సినిమాల్లో సంగీతం హిట్టయ్యింది అంటే మిగిలిన దర్శకులంతా కీరవాణి మాట వినాల్సిందే అనా?? ఇదంతా గర్వం, అహంకారంతో చెబుతున్న మాటల్లా ఉన్నాయంతే. ‘కీరవాణి లేకపోతే నేను లేను’ అని ఏ రాజమౌళి లాంటివాడో అనాలి. అంతే తప్ప సొంత డబ్బా కొట్టుకోవడం ఎందుకు… దండగ! ‘నేను రిటైర్ అయిపోతున్నా’ అంటూ నాలుగేళ్ల క్రితం కీరవాణే స్వయంగా చెప్పారు. ఆ మాట ఆయన ఎందుకు అనాల్సివచ్చిందో వివరణ ఇవ్వలేదు. ఇప్పుడూ అంతే. మీరు రిటైర్ అయిపోతానన్నారు కదా? ఎందుకు అవ్వడం లేదు? అని ఎవ్వరూ ప్రశ్నించలేదు. కానీ.. ఎందుకిలా ఆవేశ పడ్డాడో, ఆ తరవాత అంతా తూచ్ అని ఎందుకు నాలిక కరచుకొన్నాడో..!
And my journey continues. On my own terms. Good news to who ever wished for it and my heart felt gratitude for their love and support ??❤️
— mmkeeravaani (@mmkeeravaani) March 26, 2017
https://twitter.com/mmkeeravaani/status/845920612849659909
I don't think any director will like the idea of not having the Music Conposer as his subordinate .
— mmkeeravaani (@mmkeeravaani) March 26, 2017
I am grateful to Ramojirao garu , Krishnamraju garu Raghavendrarao garu, Balachander garu and Mahesh Bhat garu.
— mmkeeravaani (@mmkeeravaani) March 26, 2017
No one can reach SSR standards as long as his devotion and passion for work lasts.
Idhi vandha SHAATHAM nijam.
Idhi naa VEDHA vaakku.— mmkeeravaani (@mmkeeravaani) March 26, 2017