విభజన జరిగి ఐదేళ్లయిపోయినా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఇంత వరకూ.. ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం లేదని.. నరేంద్రమోడీ బీహార్‌లో వ్యాఖ్యానించారు. నిజానికి.. రాజకీయ పార్టీల నేతల మధ్య రాజకీయంగా .. విబేధాలు ఉంటే… ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం లేదేమో కానీ ప్రజల మధ్య మాత్రం ఎలాంటి గొడవలు లేవు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు.
విభజన చట్టం వివాదాలను పరిష్కరించే ప్రయత్నమే చేయని మోడీ..!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల గురించి తెలుసుకోకుండా.. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వాన్ని చూపించింది.. బీహార్‌లో… తెలుగు ప్రజలు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం లేదని… చెబితే.. వారికే అర్థం అవుతుంది. ఆ మాటకు వస్తే.. తెలంగాణ నేత కేసీఆర్, ఆంధ్ర నేజ జగన్… ఇద్దరూ కళ్లలోకి చూసుకుంటున్నారు. అందుకే.. నాయకుల మధ్య గొడవల్ని ప్రజల మధ్య గొడవల్లా చిత్రీకరించాంల్సిన పని లేదు. ఆయన దేశ ప్రధానిగా… గొడవలు… తగ్గేలా మాట్లాడాలి. తెలుగు రాష్ట్రాల మధ్య .. నిజంగానే అపరిష్కృతమైన విబేధాలున్నాయి. విభజన చట్టం ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు సహా… ఉమ్మడి సంస్థల విభజన వరకు అనేక అంశాలున్నాయి. వీటిని ఎవరు పరిష్కరించాలి..? ఆర్టికల్ త్రీ ప్రకారం.. రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించినప్పుడు… వీటిని పరిష్కరించే బాధ్యత కూడా కేంద్రానిదే. చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్రం.. ఇప్పటి వరకూ కనీస ప్రయత్నం చేయని కేంద్రం.. కనీస ప్రయత్నం చేయని ప్రధాని… ఇప్పుడు.. తెలంగాణ, ఏపీ ప్రజలు మధ్య ఏదో శత్రుత్వం ఉన్నట్లుగా.. బీహార్ ప్రజల ముందు ప్రసంగిస్తున్నారు. తెలుగు ప్రజలు ఐక్యంగా ఉన్నారు.
కాంగ్రెస్‌తో కలిసి విభజన చట్టాన్ని ఆమోదించిన పార్టీ బీజేపీ..!
రాజకీయ నాయకుల మధ్య రాజకీయ గొడవలకు ప్రజలకు సంబంధం లేదు. ఆ మాటకొస్తే.. కేసీఆర్ – చంద్రబాబు కన్నా… చంద్రబాబు – జగన్ ల మధ్య విబేధాలెక్కువ. రాజకీయ విబేధాలే తప్ప.. ప్రాంతీయ విబేధాలు కావు. జగన్, చంద్రబాబు ఇద్దరూ రాయలసీమకు చెందిన వారే. అయినా మొహాలు చూసుకోరు కదా..! . అయినా.. రాష్ట్రాన్ని విభజించిన… కార్యకలాపాల్లో బీజేపీది కీలకం. బీజేపీ మద్దతివ్వకపోతే బిల్లు పాలయ్యేది కాదు. కాకినాడలో.. ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నప్పుడు.. విభజన గురించి పట్టించుకోలేదు. అయితే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు… రాష్ట్రాన్ని విభజిస్తామన్నప్పుడు.. మరో మాట లేకుండా అంగీకారం తెలిపారు. ఓ రకంగా.. తామే మద్దతిచ్చి… పాస్ చేయించినట్లు ప్రచారం చేసుకున్నారు. అలాంటే… దురాలోచనతో.. కాంగ్రెస్ విడదీసినప్పుడు.. బీజేపీ ఎందుకు మద్దతిచ్చింది. కాంగ్రెస్‌ది దురాలోచన అయితే.. బీజేపీది కూడా దురాలోచన కదా..!. అన్ని రపార్టీలకు విభజన బిల్లు పాస్ చేయడంలో భాగం ఉంది. అందరిదీ దురాలోచన అయితే.. ఈ విషయంలో మోడీ సమాధానం చెప్పాలి.
తెలుగు ప్రజల లేనిపోని గొడవలు సృష్టించడం ఎందుకు..?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. బీహార్‌లో చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆంధ్రప్రదేశ్.. విభజన చరిత్ర తెలియదని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను స్వాతంత్రం వచ్చిన తర్వాత కలిపారు. గతంలో… చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు విషయంలో… ఇలాంటి చరిత్ర లేదు. అందుకే అక్కడ ఇబ్బందులు లేవు. కానీ.. ఏపీ, తెలంగాణ గతంలో… కలిసినప్పుడు.. కొన్ని ఓడంబడికలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేకాంధ్ర ఉద్యమం జరిగింది. ఇలా అరవై ఏళ్ల పాటు… ఏపీ, తెలంగాణ మధ్య ఓ రకమైన విబేధాలు ఉన్నాయి. ఇలాంటి చరిత్ర ఉన్న రాష్ట్రాన్ని… ఇలాంటి విభజన, విబేధాల చరిత్ర లేని.. మూడు రాష్ట్రాల గురించి చెబుతూ… మోడీ.. రాజకీయ ప్రచారం చేస్తున్నారు. మోడీకి చరిత్ర తెలియకపోవడం వల్లే.. ఇలా ప్రసంగించి ఉంటారని అనుకుంటున్నారు. మధ్య ప్రదేశ్ , యూపీ, బీహార్ రాష్ట్రాలను విడగొట్టి.. చత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ లను ఏర్పాటు చేసినప్పుడు… ఆయా రాష్ట్రాలకు రాజధాని వెళ్లలేదు. కానీ.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ … హైదరాబాద్ ను కోల్పోయింది. ఇప్పటికి రెండు సార్లు రాజధానిని ఏపీ కోల్పోయింది. రాజధానిని కోల్పోయిన ఆవేదన ప్రారంభమయింది. అన్నింటినీ చూస్తే… ఆంధ్రప్రదేశ్ విభజన… అత్యంత క్లిష్టమైనది. ఇవన్నీ తెలియకుండా.. మోడీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.