భారతీయ జనతా పార్టీ నేతలు.. ముఖ్యంగా ప్రధానమంత్రి దగ్గర్నుంచి… కింది స్థాయి కార్యకర్త వరకూ.. అందరూ.. ఇందిరాగాంధీ ఎప్పుడో జమానా కింద విధించిన ఎమర్జెన్సీని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అచ్చంగా అది సెలబ్రేషనే. దశాబ్దాల కిందట జరిగిపోయిన ఉదంతాన్ని.. మళ్లీ మళ్లీ గుర్తు చేసి..కాంగ్రెస్….చేసిన తప్పును.. దేశ ప్రజలకు మళ్లీ గుర్తు చేసి.. ఆ పార్టీ మీద వ్యతిరేకతను పెంచి..తనకు ఓట్ల పండగను సృష్టించుకోవడమే ఈ ఎమర్జెన్సీ కార్యక్రమాల ఎత్తుగడ. నిజానికి ఇప్పటి తరానికి ఎమర్జెన్సీ అంటే.. ఏమిటో..వాళ్లు..వీళ్లు చెబితే మాత్రమే తెలుస్తోంది. ఎందుకంటే.. ఆ రోజుల్లో ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లారా చూసిన వాళ్లు.. సీనియర్ సిటిజన్లైపోయారు. కొంత మంది రాజకీయ నేతలు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. బీజేపీలో ఉన్న నేతలే ఇప్పుడు ఆ ఎమెర్జెన్సీని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
నిజానికి ఇందిరాగాంధీనే ఎమర్జెన్సీ విధించారు. ఆమే తొలగించారు కూడా. ఎమర్జెన్సీని విధించినందుకు ప్రజలేమీ ఆమెపై తిరగబడలేదు. కానీ ఎమర్జెన్సీని తొలగించి మళ్లీ ఎన్నికలకు వెళ్లినప్పుడు ప్రజలు ఆమెను శిక్షించారు. మళ్లీ క్షమించారు కూడా. తర్వాత కూడా ఆమె.. ప్రజా తీర్పుతో ప్రధాని అయ్యారు. కానీ బీజేపీ నేతలకు మాత్రం.. ఇదో పండగలా కనిపిస్తోంది. ఇందిగాంధీని హిట్లర్‌తో పోల్చుకుని మరీ సంతోషపడుతున్నారు. ఇలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో… రాటుదేలిపోయిన.. ప్రధానమంత్రి అయితే… తను పాల్గొన్న కార్యక్రమంలో.. కొత్త కథ వినిపించారు. కాంగ్రెస్ కోసం పాట పాడలేదని.. గాయకడు కిషోర్ కుమార్ ను జైల్లో పెట్టారట. దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడీ కబుర్లు దేనికి..?
ఎమర్జెన్సీ నూటికి నూరు శాతం తప్పు.. అందుకని.. యానివర్శరీలు జరపడం దేనికి..? అదే గోధ్రా ఘటనను… అలాగే చేయగలరా..? ప్రపంచలో భారదేశంపై ఓ కమ్యూనల్ ముద్ర వేసిన దారుణామైన గోధ్రా ఘటన… గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఉన్నప్పుడు జరిగింది. ఆ ఘటనలో ఆయనపై తీవ్రమైన అభియోగాలు వచ్చాయి. ఎమర్జెన్సీ కాలంలో ఏం జరిగిందో ఈ తరానికి పూర్తిగా తెలియదు కానీ… సాటి భారతీయుల్ని.. నిస్సంకోచంగా ఊచకోత కోసిన గోద్రా గురించి మాత్రం బాగా తెలుసు. మరి ఈ ఘటనకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేరా..? బాబ్రీ సమీదును కూలగొట్టి.. దేశ ప్రజలను రెండు భాగాలుగా చీల్చిన తేదని ఇలాగే గుర్తు చేసుకుంటారా..?. ఏం చేసినా అంతా రాజకీయమే… కాంగ్రెస్ అనుంటే.. కాంగ్రెస్ ను మించిన విలువల్లేని రాజకీయాలను బీజేపీ చేస్తోంది. ప్రధానమంత్రీ చేస్తున్నారు.