ఫృధ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి వచ్చింది..!
లక్ష్మిపార్వతికి తెలుగు అకాడమీ చైర్మన్ పదవి వచ్చింది..!
కానీ…. మంచు మోహన్‌బాబు విషయం మాత్రం ఇంకా ఏం తేలడం లేదు. జగన్మోహన్ రెడ్డి.. మోహన్‌బాబుకు ఓ పదవి ఇవ్వాలన్న ఆలోచన చేయడం లేదు. జగన్ సీఎం అవగానే.. మోహన్‌బాబు పేర్లు పలు ప్రతిష్టాత్మక పదవులకు… ప్రచారంలోకి వచ్చాయి. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంది. అయితే అవన్నీ.. ఎవరో కావాలని చేసిన ప్రచారమో.. చేయించుకున్న ప్రచారంగానో మిగిలిపోయింది. పదవి మాత్రం రాలేదు. ఇలాంటి ప్రచారం జరిగినప్పుడల్లా.. మోహన్ బాబు.. ఓ నోట్ విడుదల చేసేవారు.. తనకు ఆ ప్రచారానికి సంబంధం లేదని… అందులో నిజం లేదనేది.. ఆ నోట్లో సారాంశం.
మోహన్‌బాబుకు.. టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే స్థాయికి తగ్గట్లుగా ఉండేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు.. ఏ ఎఫ్డీసీ చైర్మన్ పదవో.. మరొకటో.. ఇస్తే.. ఆయన రేంజ్‌ను తగ్గించుకున్నట్లే అవుతుంది. ఆయన రెండు దశాబ్దాల క్రితమే రాజ్యసభ సభ్యుడు…పైగా పద్మశ్రీ కూడా. అలాంటి లెజెండ్‌కు… చిన్న చిన్న పదవులు ఇస్తే అవమానకరమే. అందుకే.. ఆయన కూడా… అలాంటివి ఆశించడం.. తన రేంజ్‌కు తగ్గట్లుగా.. పెద్ద పదవినే ఆశిస్తున్నారు. అందుకే… ఆలస్యమవుతోందని.. వైసీపీ వర్గాలు చెబుతూంటాయి.
నవరత్నాల అమలులో బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన గురించి అప్పుడప్పుడు.. మోహన్‌బాబు వెరైటీగా గుర్తు చేస్తూంటారు. చంద్రబాబు అన్నారో.. లేదో.. ఎవరికీ తెలియని మాటల్ని.. సోషల్ మీడియా లో పోస్ట్ చేసి.. తన మనసు నొప్పించారని.. ఆయనను ఘాటుగా విమర్శిస్తూంటారు. అయితే.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ప్రతీ విషయంలోనూ… ప్రభుత్వాన్నే తప్పు పట్టిన ఆయన.. ఏపీలో ఈ ఐదు నెలల కాలంలో.. జరిగిన పరిణామాలపై స్పందించడం లేదు. అందుకే.. ఆయన ట్వీట్లు చేస్తే.. అందరూ.. వాటిపై ప్రశ్నలతోనే కామెంట్లు చేస్తున్నారు.