“హైదరాబాద్‌లో ఉండి తెలంగాణ సమస్యలపై ఎవరైనా గొంతెత్తితే… వారిని తన్ని తరిమేస్తారనే భయంతో… ఎవరూ మాట్లాడరు…” ఇదీ ఆంధ్ర ప్రముఖుల గురించి ఓ ప్రముఖ పత్రిక ఎడిటర్.. తన కాలమ్‌లో రాసిన మాట. అందులోనే… ఆయన.. అదే ఏపీ గురించి అయితే.. తాము చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా.. సొంత రాష్ట్రానికి అన్యాయం చేయడానికి వారు ఏ మాత్రం వెనుకడగు వేయరని తేల్చారు. అదే నిజం. ఈ విషయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల దగ్గర్నుంచి… మంచు మోహన్ బాబు వరకూ.. ఎవరూ … తక్కువ కాదు. తమ టెంపోను.. ఏపీ విషయంలోనే చూపిస్తారు. దశాబ్దాలుగా. .ఎక్కడైతే స్థిరపడ్డామో.. అక్కడ మాత్రం సైలెంట్‌గా ఉంటారు. ఇప్పుడు ఇంటర్ ఫలితాల విషయంలో మౌనమే దానికి సాక్ష్యం..!
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై “విద్యావేత్త” మోహన్‌బాబు నోరు పెగలట్లేదేంటి..?
మంచు మోహన్ బాబు.. ఆయన నటుడే కానీ.. విద్యావేత్త కూడా. మొన్న ఏపీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ఇవ్వలేదని… తనకు ఫీజులు కట్టి.. తన కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులను తీసుకుని రోడ్డెక్కినప్పుడు.. చాలా మందికి… ఈ విషయం అర్థం అయిపోయింది. ఆయనకు తెలంగాణలో కూడా.. కాలేజీలు ఉన్నాయి. విద్యావేత్తగా… ఆయన అనేక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. కానీ… ఇప్పుడు మాత్రం నోటికి ప్లాస్టర్ వేసేసుకున్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారిపోయింది. కొన్ని వేల మంది విద్యార్థుల మార్కులు తారుమారయ్యాయి. ఫెయిలయ్యామన్న బాధతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి.. అనేక మంది విద్యావేత్తల గుండెకోతకు కారణం అవుతోంది. తప్పు ఎవరు చేశారు… ఎవరు శిక్ష అనుభవిస్తున్నారు అని వారు ఆక్రోశిస్తున్నారు. కానీ ఇందులో… మోహన్‌బాబు వాయిస్ మాత్రం వినిపించడం లేదు. తనకు రాని… వచ్చే అవకాశం లేని.. ఫీజులను ఎలా రాబట్టుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారేమో కానీ… విద్యార్థులకు ఎదురైన కష్టం గురించి మాత్రం.. ఆయన స్పందించడం లేదు. ఎందుకు..? ఆ డైనమిజం ఎటు పోయింది..? కొన్ని దశాబ్దాల నుంచి విద్యారంగంలో ఉండి.. ప్రస్తుత ఇంటర్ ఎన్నికల తీరుపై ఎందుకు స్పందించరు..?
ఓన్లీ కలెక్షనేనా..? విద్యావ్యవస్థపై బాధ్యత లేదా..?
మోహన్ బాబు అంటే కలెక్షన్ కింగ్.. అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లు, కాలేజీ ఫీజుల కలెక్షన్లు. ఏదైనా కలెక్షన్లే. తన కలెక్షన్లకు… ఏదైనా సమస్య ఏర్పడితే.. విద్యార్థులను తీసుకుని రోడ్డెక్కేస్తారు. ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ పెద్దలను అసభ్యంగా దూషిస్తారు. అసలు బకాయిలు లేవు .. మొత్తం ఇచ్చేశాం కదా.. అని ప్రభుత్వం ప్రకటిస్తే… మారు మాట్లాడరు. .. కానీ తిట్లు మాత్రం అదే పద్దతిలో కొనసాగిస్తారు. అంతగా.. విద్యారంగానికి అంకితమైపోయిన మంచు మోహన్ బాబు.. ఇప్పుడు ఇంటర్ విద్యార్థుల వేదనపై ఎందుకు మాట్లాడరు. వారిని ఎందుకు ధైర్యం చెప్పరు..? కష్టపడి పరీక్షలు రాయడమే తమ తప్పన్నట్లుగా మథనపడిపోతున్న విద్యార్థులకు… ఎందుకు భరోసా ఇవ్వరు..?. వారి దగ్గర నుంచి లక్షలకు లక్షలకు ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు.. ప్రముఖ విద్యావేత్తగా.. ఓ సందేశం ఎందుకు ఇవ్వరు..? పిల్లల్ని ఇలా వేదన పెడుతున్న వారి చర్యలను ఖండిస్తూ ఓ ట్విట్టర్ ప్రకటన అయినా ఎందుకు చేయరు..? ఆ బాధ్యత లేదా..?
ఈ “ఇంటర్ తప్పులు” ఏపీలో జరిగి ఉంటే చొక్కాలు చించుకునేవాళ్లు కాదా..?
అదే ఆంధ్రప్రదేశ్‌లో…. తెలంగాణలో ఇంటర్ తప్పిదాలు జరిగినట్లు జరిగి… విద్యార్థులు ఆవేదనకు గురి అయి ఉంటే… విద్యావేత్త మోహన్ బాబు.,.. కామ్‌గా ఉండేవారా..? ఆయన గుండె మండిపోయేది..!. ఆవేశం ఉప్పొంగేది..!. విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటున్న దానికి ఆయన కళ్ల వెంట నీళ్లు వచ్చేసేవి..!. ఈ పాటికి… తిరుపతిలోనో… విజయవాడలో.. ఆయన చొక్కాలు చించుకుని.. ఉద్యమానికి రెడీ అయిపోయేవారు. చంద్రబాబును… తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి… విద్యార్థుల పేరుతో.. తన కోపాన్ని చల్లార్చుకుని ఉండేవారు. అసలు బాకీ లేని రీఎంబర్స్కోసమే పిల్లల్ని తీసుకుని రోడ్డెక్కిన మోహన్ బాబు.. ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు జరిగితే.. ఊరుకుంటారా..? అవకాశమే లేదు. కానీ.. జరిగింది తెలంగాణలో కాబట్టి… ఆయన ఏమీ మాట్లాడరు. ఎందుకంటే.. అక్కడ మాట్లాడితే తన్ని తరిమేస్తారు..? అదే ఏపీలో అయితే.. ఏమైనా చేయవచ్చు..! ఏపీ ప్రయోజనాల కోసం. … ఎప్పుడూ మాట్లాడకపోయినా…. తమ స్వార్థం కోసం రాజకీయమే చేసుకున్నప్పుడు… ఇలాంటి వాటిలో ఇంకెంత అయినా.. రాజకీయం చేసుకోవచ్చు..! ..
ఈ తెలంగాణ పౌరసత్వం తీసుకున్న ఈ ఆంధ్రాబాబులకు కావాల్సింది.. ఏపీని అడ్డం పెట్టుకుని… రాజకీయాలు చేయడమే. తమ వ్యక్తిగత ప్రయోజనాలను రక్షించుకోవడమే. కానీ.. ప్రజల బాగోగులు మాత్రం ఎప్పుడూ పట్టవు… !. దీన్ని మంచు మోహన్ బాబు మరోసారి నిరూపించారు.