పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని పడగొట్టేయడంలో ఆరితేరిపోయాడు నితిన్. ఇష్క్ నుంచి మొదలు.. పవన్‌ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడం మొదలెట్టాడు. పవన్ పాటల్ని టైటిళ్లుగా మార్చుకొన్నాడు.పవన్‌ని తన ఆడియో వేడుకలకు రప్పించాడు. పవన్ డైలాగుల్నీ, పాటల్నీ వాడేశాడు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్‌ని తన వైపుకు తిప్పుకొన్నాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా అంతే. పవన్ అంటే త్రివిక్రమ్, త్రివిక్రమ్ అంటే పవన్. ఆ రేంజుకు చేరింది వాళ్ల స్నేహ బంధం. ఇద్దరూ కలసి సినిమా చేస్తే… ఆ సినిమాలో పవన్ ని వాడుకోకుండా ఎలా ఉంటారు. పవన్ ఫ్యాన్స్ కూడా అదే ఆశించారు. అ.ఆ సినిమాలో పవన్ ప్రస్తావన తప్పకుండా ఉంటుందనుకొన్నారు. పవన్‌ని గుర్తు చేస్తూ డైలాగో, పాటో ఉంటుందని అంచనాలు వేసుకొన్నారు.
కానీ.. అ.ఆలో అవేం కనిపించలేదు. దాంతో పవన్ ఫ్యాన్స్ షాకయ్యారు. ఎప్పుడూ పవన్‌కి భజన చేసే నితిన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. త్రివిక్రమ్ ఒక్క డైలాగ్ కూడా రాయలేదు. కావాలనే.. పవన్ పేరు రాకుండా జాగ్రత్తపడ్డారేమో..?? పదే పదే పవన్‌ని పొగుడుకొంటూ వెళ్తే బాగోదని.. ఈసారికి ఇలా రెస్టిచ్చారేమో ? ఈ మార్పు ఈ సినిమాకేనా, రాబోయే సినిమాల్లోనూ ఇంతేనా..?? ఏమో మరి. ఈ విషయాన్ని నితిన్నే అడగాలి.