నిత్యమీనన్ సినిమా అంటే.. కచ్చితంగా అది మినీ లేడీ ఓరియెంటెడ్ మూవీనే అనుకోవాలి. ఎందుకంటే సినిమా అంతా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకొంటుంది నిత్య. హీరో ఎవరైనా తన డామినేషన్ చూపిస్తుంది. నిత్య కథల ఎంపికలో చాలా సెలక్టీవ్. తనకు నప్పే, తనకు నచ్చిన కథలనే ఎంచుకొంటుంది. పారితోషికం విషయంలో రాజీ పడినా, పాత్ర విషంయలో ఏమాత్రం రాజీ పడదు. తన సినిమాలకు ప్రమోషన్ విషయంలోనూ నిత్య పెద్ద మనసు చేసుకొంటుంది. అయితే ఒక్క అమ్మాయి తప్ప.. ప్రమోషన్లలో నిత్య కనిపించడం లేదు. కారణమేంటి? చిత్రబృందానికీ, నిత్యకీ ఏమైనా సమస్యలా?
అయితే సందీప్‌కిషన్ మాత్రం నిత్య చాలా మంచి అమ్మాయి, మా సినిమాకి ఎంతో చేసింది, ప్రమోషన్లకు డుమ్మా కొట్టే క్యాండిడేట్ కాదంటున్నాడు. తనకు వేరే సినిమాలున్నాయని, ఆ కాల్షీట్లు కదపడం ఇష్టం లేకే.. ప్రమోషన్లకు రావడం లేదని, సినిమా రిలీజ్ అయిన తరవాత తప్పకుండా ప్రమోషన్లలో కనిపిస్తుందని చెబుతున్నాడు సందీప్. ఈ సినిమా కోసం నిత్య తన పారితోషికాన్ని కూడా తగ్గించుకొందట. అంత మంచి అమ్మాయి.. ప్రమోషన్లకు రాకుండా ఎలా ఉంటుందన్నది నిత్య వాదన. అయితే సినీ వర్గాలు మాత్రం ఈ సినిమా కథ చెప్పేటప్పుడు నిత్యమీనన్ పాత్రని ఒకలా ట్రీట్ చేశారని, సెట్లోకి వచ్చేటప్పటికి ఆ పాత్ర ప్రాధాన్యం తగ్గిపోయిందని, ఇస్తానన్న రెమ్యునరేషన్ విషయంలోనూ నిర్మాతలు పేచీ పెడుతున్నారని, అందుకే పబ్లిసిటీకి దూరంగా ఉంటోందని టాక్.