వైసీపీ నాయకురాలు రోజాపై ఉన్న అవినీతి ఆరోపణలకు లెక్క లేదు. శ్రీవారి వీఐపీ టిక్కెట్లను అమ్ముకోవడం దగ్గర నుంచి ఆడుదాం ఆంధ్రా కిట్ల కొనుగోలు వరకూ ఆమెపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారి తొమ్మిది నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ రోజాపై ప్రకటనలే కానీ విచారణలు ప్రారంభించిన దాఖలాలు లేవు.తాజాగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా అసెంబ్లీలో రోజా అవినీతిపై విచారణ గురించి ప్రకటన చేశారు . కానీ అది కూడా కంటి తుడుపుగానే ఉంది.
ఆడుదాం.. ఆంధ్రాలో అవినీతి లేకపోతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే లీడర్ కనిపించకుండా పోరు. రోజా మంత్రి అయితే శాప్ చైర్మన్ గా ఆయన ఇద్దరూ కలిసి కమిషన్లు దండుకున్నారని చెబుతారు. మహిళల్ని అరెస్టు చేయరన్న ధైర్యంతో.. రోజా సవాళ్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అయినా ఆమె చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టాల్సి ఉంది. కేసుల సంగతి తర్వాత అయినా.. రోజా తిరుమల శ్రీవారిని మార్కెట్ చేసుకున్న వైనం బయట పెట్టినా సంచలనం అవుతుంది. ప్రతీ వారం ఆమె ఎందుకు దర్శనానికి వెళ్లేవారో బయట పెడితే ప్రజలు నిర్ణయించుకుంటారు.
టీటీడీ విజిలెన్స్ పూర్తి స్థాయిలో అన్ని అక్రమాలను వెలికి తీసింది.నివేదిక రెడీ చేసింది. ఎవరెవరు వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు అమ్ముకున్నారో కూడా స్పష్టత వచ్చింది. అలాంటప్పుడు ఎందుకు విచారణలు ఆలస్యమవుతున్నాయో టీడీపీ క్యాడర్ కూడా అర్థం కావడం లేదు. ఆమె చిన్న చిన్న మాటలు మాట్లాడలేదు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అత్యంత ఘోరమైన భాషను వాడిన వారిలో మొదటి వరుసలో ఉంటారు. అందుకే.. రోజాపై విచారణలు ప్రారంభించాలని కోరుకుంటున్నారు.