ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై విమర్శలతో దాడి చేసి… న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలు చేసి.. పార్టీలకు ముడిపెట్టి… సోషల్ మీడియాలో న్యాయమూర్తులను చంపుతామని హెచ్చరికలు చేసిన వ్యవహారంపై మెల్లగా సీబీఐ విచారణలో వేగం పెంచుతోంది. విదేశాల్లో కూడా నిందితులు ఉన్నందున వారిని విచారించడానికి నాలుగు నెలల సమయం కావాలని కోర్టును.. సీబీఐ కోరింది. ఆ మేరకు కోర్టు సమయం ఇచ్చింది. దీంతో ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి వెళ్లిందని అనుకున్నారు. కానీ సీబీఐ… అందరికీ నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. జడ్జిల కాల్ లిస్ట్ చెక్ చేయాలని.. వారు చంద్రబాబు చెప్పినట్లుగా తీర్పులు చెబుతున్నారని ఆరోపించిన ఎంపీ నందిగం సురేష్… ఇంకా దారుమమైన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లతో పాటు పలువురు వైసీపీ నేతలకు సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
గతంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు.. సీఐడీ పోలీసులు కొంత మందిపైనే కేసులు నమోదు చేశారు. కానీ హైకోర్టు 90మందికిపైగా నోటీసులు జారీ చేసింది. వారు చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డెడ్. సాక్ష్యాలతో సహా ఉన్నాయి. అయితే సీఐడీ పోలీసులు మాత్రం.. తూ..తూ మంత్రంగా పదిహేను మందిపై కేసులు పెట్టారు. ఆ కేసులపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసుల తీరుపై… హైకోర్టు పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవడం లేదనేదానికి అదే సాక్ష్యమన్నట్లుగా పలుమార్లు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అయినా పోలీసుల తీరులో మార్పు రాలేదు. చివరికి కేసును సీబీఐకి అప్పగించింది. ఇప్పుడుసీబీఐ…. న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేసిన వారందరిపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆమంచి కృష్ణమోహన్ , గుడివాడ అమర్నాథ్, నందిగం సురేష్ మాత్రమే కాదు.. పలువురు వైసీపీ నేతలు.. చాలా అసువుగా న్యాయమూర్తులపై బురద చల్లారు. చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు వారి ఆరోపణలకు ఆధారాలు సమర్పించాల్సి ఉంది. టీవీల ముందు.. రికార్డెడ్‌గా వారు ఆ విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికీ.. నోటీసులు వెళ్తున్నాయి. న్యాయవ్యవస్థపై.. రాజకీయ పార్టీలపై చేసిట్లుగా ఆరోపణలు చేస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేశారని నమ్ముతారు. అందుకే.. ఇప్పుడు… ఆ వ్యాఖ్యలు చేసిన నేతలందరికీ.. నోటీసులు జారీ చేస్తున్నారు. వారు ఆధారాలు సమర్పించకపోతే.. కేసులు పెట్టే అవకాశం ఉంది.
న్యాయవ్యవస్థపై దాడిని తేలిగ్గా తీసుకుంటే… ముందు ముందు మరింత మంది అలాంటి దాడులకు ప్రమాదం ఉందనే అభిప్రాయం అందటా వినిపిస్తోంది. అందుకే… సీబీఐ … అంత తేలిగ్గా తీసుకోదని చెబుతున్నారు. కాస్త సమయం తీసుకున్నా.. అందులో ఉన్న కుట్ర మొత్తాన్ని బయటకు లాగుతుందని న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నారు. అంతా ఆర్గనైజ్డ్గా జరిగిందని భావిస్తున్న సమయంలో.. సీబీఐ ఎంత సీరియస్‌గా పని చేస్తే.. అంత సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.