నెంబర్ వన్ మేమే అంటూ.. రెండు చానళ్లు ఒకరుపై ఒకరు కుట్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ ఆ రెండింటికి ఓ లక్షణం ఉంది. అదేమిటంటే.. కూలీ చేయడం. ఒకే పార్టీకి కూలీ చేయడం దగ్గర ఆ చానళ్లకు భావసారూప్యం ఉంది. ఆ విషయం శుక్రవారం మరోసారి నిరూపితమైంది.
నెంబర్ వన్, టు చానళ్లకు హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ కనిపించలేదు. అది పబ్లిక్ డాక్యుమెంట్.అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందులో సంచలనాత్మక విషయాలు ఉన్నాయి. అందరూ ఇచ్చారు. కానీ ఈ రెండు చానళ్లకు మాత్రం.. తమ అనధికారిక సూపర్ ఎడిటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. అందుకే వేయలేదు. కానీ ఇదే రెండు చానళ్లు.. రెండు వారాల కిందట కరకట్టపై చంద్రబాబు నివాసం జప్తు అంటూ చేసిన హడావుడి మాత్రం ఇప్పటికీ ఉంది.
అసలు లేని స్కాంలో ఆస్తులు ఎలా జప్తు చేస్తారో ..అసలు క్విడ్ ప్రో కో పేరుతో ప్రైవేటు ఆస్తుల్ని జప్తు చేసే అధికారం సీఐడీకి ఉందా లేదా అనే ఆలోచన చేయకుండా .. అసలు సీఐడీకి ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్లో ఏముందో చెప్పకుండా తప్పుడు ప్రచారం చేసేశారు. అక్కడ స్కాం జరిగిదని..చంద్రబాబు దొరికిపోయారన్నట్లుగా రాశారు. ప్రచారం చేశారు. కానీ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. వారు చేసిన ప్రచారం నిజం అయితే..సీఐడీ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. తాము ప్రచారం చేశాం కాబట్టి ఈ విషయంలో సీఐడీని ఈ మీడియా ఎందుకు ప్రశ్నించదు.
మీడియా అంటే ప్రజల తరపున విపక్షంగా ఉండాలి.కానీ ఇక్కడ విపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తూ.. అధికార పార్టీ నేతలు అత్యంత దారుణమైన హత్యలు చేసినా నిస్సిగ్గుగా సపోర్టు చేస్తూ.. “విలువ” లెక్క కట్టుకుంటున్నారు. వీరిని నీలి మందకు కూలి మీడియా అంటే తప్పేముంది ?