ఆ జర్నలిస్ట్.. చంద్రబాబును ఏ ఉద్దేశంతో అడిగారో కానీ.. జనసేన, టీడీపీ కలుస్తాయంటూ రచ్చ ప్రారంభమయింది. అదేదో పెద్ద సూచనలాగా… రెండు పార్టీల నేతలు ఇటీవలి కాలంలో విమర్శలు చేసుకోవడం లేదనే కొత్త వాదన … గట్టిగానే వినిపిస్తోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడూ పవన్ కల్యాణ్‌ను విమర్శించలేదు. కానీ పవన్ కల్యాణ్ విమర్శించినప్పుడు మాత్రం.. గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ విమర్శలు చేసినా… టీడీపీ నేతలు ఎప్పుడూ వ్యక్తిగతంగా వెళ్లలేదు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్… రాజకీయంగా యాక్టివ్‌గా లేరు. అనంతపురం నుంచి నేరుగా అమెరికా వెళ్లి.. మళ్లీ వచ్చి యూరప్ వెళ్లిపోయారు. ఈ మధ్య కాలంలో.. టీడీపీపై ఎలాంటి విమర్శలు చేయలేదు కాబట్టి.. వాళ్లు స్పందించలేదు. అయితే.. ఈ రెండు పార్టీలు విమర్శలు చేసుకోవడం లేదు చూశారా అంటూ.. సోషల్ మీడియాలో కొత్త ప్రచారం ప్రారంభించారు.
అయితే.. చంద్రబాబు ” కలిస్తే తప్పేంటి..?” అంటూ చేసిన వ్యాఖ్యల ప్రభావం చాలా తీవ్రంగానే ఉంది. దీనిపై… చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ లనూ ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్ ఏమైనా స్పందిస్తాడేమోనని చూస్తున్నారు. జనవరి ఒకటో తేదీనే విజయవాడ వచ్చిన ఆయన… ఇంత వరకూ చంద్రబాబు స్పందనపై… పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చపై స్పందించలేదు. కనీసం ఓ ట్వీట్ అయినా పెట్టలేదు. మౌనం అర్థాంగీకారేమేమో అన్న భయంతో.. జనసేన వర్గాలు.. పాత ట్వీట్‌ను బయటకు తీసి వైరల్ చేశాయి. మూడు నెలల క్రితం… సందర్భం ఏమీ లేకపోయినా …పొత్తులపై ఏవేవో పుకార్లు పుట్టిస్తున్నారని.. . ఒంటరిగానే పోటీ చేస్తామంటూ చేసిన ట్వీట్‌ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇంత కష్టం ఎందుకు.. పవన్ కల్యాణ్ నేరుగా ఓ ట్వీట్ చేయవచ్చు కదా..అనే సందేహం.. జనసేన అభిమాలను కూడా సహజంగానే వేధిస్తోంది.
పవన్ కల్యాణ్ అధికారికంగా స్పందిస్తేనే దీనిపై.. క్లారిటీ వస్తుంది. ఈ విషయంపై ప్రజల్లో ఎంత చర్చ జరిగితే.. జనసేనకు అంత నష్టం వస్తుంది. పవన్ కల్యాణ్.. ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. అందుకే… ఆయన అటు చంద్రబాబును.. ఇటు జగన్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఇంత క్లారిటీగా ఉంటే… మళ్లీ టీడీపీతో లింకప్ అంటూ వచ్చే వార్తల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే.. నష్టం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ నేరుగా ప్రెస్‌మీట్ పెట్టకపోయినా.. కనీసం.. కొత్తగా ఓ ట్వీట్ అయినా చేయాలని కోరుకుటున్నారు. మరి జనసేనాని మనసులో ఏముందో..?