జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల పద్దెనిమిదో తేదీన తూర్పుగోదావరి జిల్లాలో పోరాటయాత్ర నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికీ అర్ధం కాలేదు. హైదరాబాద్ రాలేదని మాత్ర క్లారిటీ వచ్చింది. దాంతో.. పవన్ కల్యాణ్ ముంబై వెళ్లారని ప్రచారం జరిగింది. అక్కడ.. అదే సమయంలో.. టీఆర్ఎస్ వారసుడు కేటీఆర్.. ఓ కార్యక్రమంలో అవార్డు తీసుకునేందుకు ముంబై వెళ్లారు. అక్కడే… తెలంగాణ ఎన్నికలపై చర్చలు జరిపారని.. . గ్రేటర్ పరిధిలో ఓట్లను చీల్చేందుకు.. కొన్ని ఎంపిక చేసిన.. నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు సబంధించిన కొంత మంది నేతల్ని.. జనసేన బీఫాంపై నిలబెట్టబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ధృవీకరణ కాలేదు. కానీ పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియలేదు. కానీ.. తాజాగా తెలుస్తున్న సమాచారం.. పవన్ కల్యాణ్.. సీక్రెట్‌గా అమెరికా వెళ్లి వచ్చారు. అక్కడో ముఖ్యమైన వ్యక్తితో సమావేశం జరిపి తిరిగి వచ్చారు. ఈ విషయాన్ని పయనీర్ పత్రిక జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ రిపోర్ట్ చేశారు.
పద్దెనిమిదో తేదీన అదృశ్యమైన పవన్ కల్యాణ్ 22వ తేదీన చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఆయన పద్దెనిమిదో తేదీన నేరుగా అమెరికా వెళ్లి.. అక్కడ తాను కలవాలనుకున్న మనిషిని కలిసి.. చర్చించాల్సిన అంశాలు చర్చించి.. చెన్నైలో ల్యాండయ్యారు. అక్కడే ప్రెస్‌మీట్ ను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే.. చెన్నైలో ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్ అలా అమెరికా వెళ్లి వచ్చిన తర్వాతనే… గతంలోఎన్నడూ లేని విధంగా జగన్‌ను టార్గెట్ చేశారు. అప్పటి వరకూ.. టీడీపీ అధినేతను.. ఆయన కుమారుడ్ని ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించి.. విరుచుకుపడే పవన్.. అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత.. ఆ ప్రథమ ప్రాథాన్యత.. జగన్‌కు ఇస్తున్నారు. ఆయనను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ స్ట్రాటజీ మార్పు వెనుక.. అమెరికా పర్యటన ఉందని భావిస్తున్నారు.
ఇంతకీ పవన్ కల్యాణ్.. సీక్రెట్‌గా ఎవరికీ తెలియకుండా.. అమెరికా వెళ్లి ఎవర్ని కలిశారన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే.. జగన్ విషయంలో.. హార్డ్ కోర్.. విమర్శలు ప్రారంభించారు కాబట్టి.. కచ్చితంగా తన పార్టీకి చెందిన… విధివిధానాల విషయంలో..స్పష్టమైన సలహాలు పొంది వచ్చి ఉంటారని.. వాటిని ఇక్కడ అమలు చేస్తున్నారని… భావిస్తున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. లేకపోతే.. అది సీక్రెట్‌గానే ఉండే అవకాశం ఉంది.