రాజకీయాల్లో వ్యూహాత్మక మౌనం అనేది ఒకటి ఉంటుంది. అది.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నారు. ఈ వ్యూహాత్మక మౌనాన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడు… అమలు చేస్తాయంటే.. ఓ నిర్ణయం తీసుకునే ముందు… ఆ నిర్ణయానికి సంబంధించిన ఫీలర్‌ను ప్రజల్లోకి పంపి.. వారిలో వచ్చే రియాక్షన్‌ను… పరిశీలిస్తాయి. అందుకే.. అన్ని వర్గాల ప్రజల రియాక్షన్ తెలుసుకునేలా… కొంత కాలం మౌనం పాటిస్తారు. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ కూడా అలాంటి మౌనంలోనే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
జనసేన మాతో కలిస్తే తప్పేమిటన్న… చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత ఏపీలో ముఖ్యంగా … జనసైనికుల్లో ఓ అలజడి రేగింది. టీడీపీ నేతలు.. పవన్ తమపై వస్తారని… ప్రచారం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఆయన చంద్రబాబు పార్టనరేనంటూ.. విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఈ రెండింటికి కేంద్ర బిందువైన జనసేన అధినేత మాత్రం… మౌనం పాటిస్తున్నారు. విజయవాడలోనే ఉన్నప్పటికి.. జరుగుతున్న ప్రచారంపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. దీంతో… ఆయన తెలుగుదేశం పార్టీతో కలిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై.. ప్రజాస్పందనను బేరీజు వేసుకుంటున్నారని అనుకోవచ్చన్న అంచనాలు వస్తున్నాయి. నిజానికి పవన్ కల్యాణ్‌తో పొత్తును తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందా… అనే దానిపైనా క్లారిటీ లేదు. నాలుగో ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబుపై విమర్శలు చేసినప్పటి నుంచే.. ఆయన తమకు లేరని.. టీడీపీ నేతలు ఫిక్సపోయారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ను ఇటీవలి కాలంలో.. టీడీపీతో ముడి పెట్టే ప్రయత్నం జగన్ ఎక్కువగా చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గానే చెప్పారని చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలన్న భావనలో ఉన్నారు. కలసి వస్తామన్న కమ్యూనిస్టులను కూడా పట్టించుకోకుండా.. 175 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. టీడీపీ, వైసీపీలకు సమదూరం పాటిస్తూ వస్తున్నారు. రెండు పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తమ పార్టీపై చేసే విమర్శలకు వైసీపీ నుంచి వ్యక్తిగత విమర్శల దాడి కౌంటర్‌గా వస్తోంది. కానీ టీడీపీ మాత్రం.. విధాన పరంగానే స్పందిస్తోంది. ఇప్పుడు మార్పొచ్చింది. దీనిపై పవన్ కల్యాణ్.. ఓ స్పష్టమైన నిర్ణయం మాత్రం ప్రకటించలేకపోతున్నారన్నది మాత్రం… “వ్యూహాత్మక మౌనం”తోనే అర్థమవుతుంది. సరైన సమయంలో స్పందించకపోతే.. ఒక్కో సారి అదే సమస్యగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది.