మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి లిక్కర్ వ్యాపారాన్ని.. ఢిల్లీలో జగన్ వాయిస్ ను తనకు చేతనైన రీతిలో నిర్వహించిన ఆయన కుమారుడు మథున్ రెడ్డి కూడాఎక్కడా కనిపించడం లేదు. నిజానికి వైసీపీ ఏ కార్యక్రమం పెట్టినా వాళ్లు ముందుండేవారు. కానీ వారు పట్టించుకోకపోతూండటంతో వారికి ఇచ్చిన పార్టీ పదవుల్ని కూడా జగన్ తీసేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నెంబర్ టు. చిత్తూరు, అనంతపురం జిల్లాల బాధ్యతలను జగన్ ఆయనకు ఇచ్చారు. అయితే జగన్ రెడ్డి చేసిన పరిపాలనతో ప్రజలు ఏకపక్ష నిర్ణయం ప్రకటించడంతో ఆ రెండు జిల్లాల్లోనూ వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, ఆయన కుమారుడు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచారు. మిగతా అన్నీ ఓడిపోవడం సరే కానీ వీరు మాత్రమే ఎలా గెలిచారని జగన్ కు అనుమానం వచ్చింది. అప్పటి నుంచి ఆయనను దూరం పెట్టారని అంటున్నారు. ఈ అవమానాలను భరించలేక ఆయన కూడా సైలెంట్ అయిపోయారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీకావు. అంగళ్లులో చంద్రబాబును చంపడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అనుమానాలున్నాయి. ఆ రోజు చంద్రబాబు పర్యటనలో పోలీసులు వ్యవహరించిన విధానం, పుంగనూరు వద్ద జరిగిన అల్లర్లలో పెద్దిరెడ్డి ప్లాన్ ఉందని చాలా మంది చెబుతారు. ఇక ఆర్థిక అరాచకాల గురించి లెక్కేలేదు. రాజకీయంగా యాక్టివ్ గా ఉంటే… ఇవన్నీ బయటకు వస్తాయని ఆయన సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. జగన్ కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారు.