క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గినా… పెట్రోల్ రేట్లు త‌గ్గించ‌రా?

అంత‌ర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. అయినా, మ‌న కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌ల మీద క‌నిక‌రం లేదు. సామాన్యుడికి గుదిబండ‌ల మారిన పెట్రోల్, డీజిల్ రేట్ల‌ను త‌గ్గించాల‌న్న క‌నీస ఆలోచ‌న కూడా చేయ‌టం లేదు.

ఇత‌ర దేశాల‌తో పోల్చితే మ‌న దేశంలోనే పెట్రోల్, డీజిల్ పై ప‌న్నుల శాతం అధికం. అందుకే దాన్ని జీఎస్టీ ప‌రిధిలోకి తీసుక‌రాలేదు. అయితే, అంత‌ర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ రేట్లు పెరిగిన వెంట‌నే రేట్లు పెంచేసే ఆయిల్ కంపెనీలు, త‌గ్గిన‌ప్పుడు మాత్రం త‌గ్గించేందుకు క‌నీస ప్ర‌య‌త్నం కూడా చేయ‌వు.

అంత‌ర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధ‌ర 70డాల‌ర్ల దిగువ‌కు ప‌డిపోయింది. ఇది దాదాపు 9నెల‌ల కనిష్ట స్థాయి. అయినా రేట్లు ఏమాత్రం త‌గ్గించ‌టం లేదు. గ‌డిచిన ప‌ది సంవ‌త్స‌రాల్లో పెట్రోల్ పై వంద శాతంకు పైగా ఎక్సైజ్ డ్యూటీ పెంచ‌గా, డీజిల్ పై 300శాతంకు పైగా పెరిగింది. ఫ‌లితంగా రేట్లు దాదాపు 30 రూపాయ‌ల‌కు పైగా పెరిగిపోయాయి. దీంతో స‌గ‌టు వేత‌న జీవితో పాటు నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌లకు రెక్క‌లు వ‌చ్చాయి.

అయితే, క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గటంతో ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌ని ఆయిల్ కంపెనీలు… కొన్ని రోజులుగా పాత ధ‌ర‌ల‌నే కొన‌సాగిస్తూ వ‌స్తున్నాయి. అయితే, త్వ‌ర‌లోనే పలు రాష్ట్రాల్లో ఎన్నిక‌లున్న నేప‌థ్యంలో, పెట్రోల్-డీజిల్ రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close