దువ్వాడ ఫ్యామిలీ డ్రామాల చూసేందుకు ప్రజలకు మరింత కాలం అవకాశం ఇవ్వాలని పోలీసులు అనుకుంటున్నారేమో కానీ.. ఈ డ్రామాను నిరంతరం కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్వెల మాధురీ కూడా అరెస్టు చేయగలిగిన నేరాలు చేశారని వీడియో సాక్ష్యాలతో సహా ఉన్నాయి. కానీ వారిపై పోలీసులు కేసులు పెట్టడడం లేదు.. చర్యలు తీసుకోవడం లేదు.. దీంతో ఆయన పోలీసులకు చేత కాదని చెప్పి.. వారిపైనే రివర్స్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు.
దివ్వెల మాధురీ ఉద్దేశపూర్వకంగా వేరే కారును ఢీకొట్టారు. ఇది అత్యంత తీవ్రమైన నేరం. ఆ కారులో ఉన్న ముగ్గురు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. మామూలుగా అయితే ఆమెను అప్పుడే అరెస్టు చేసి జైలుకు పంపాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ ఆ కోణంలో పోలీసులు కేసులు కూడా పెట్టలేదు. ఇక అరెస్ట్ కు చాన్స్ లేదు. ఇక దువ్వాడ శ్రీనివాస్ భార్య బిడ్డలను కొట్టేందుకు వెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై రుబాబు చేశారు. ఆయనపైనా కేసులు పెట్టలేదు.
Read Also : దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్
ఇప్పుడు ఆయనే రివర్స్‌లో తన భార్య, బిడ్డపై పోలీసులు చర్యలు తీసుకోలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు దువ్వాడ ఇష్యూ ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటే .. న్యూసెన్స్ చేస్తున్నారనుంటే పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. కానీ అలాంటిది చేయకుండా.. వారు దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురీ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో చూసేవారికీ అర్థం కావడంలేదు.
దువ్వాడ ఫ్యామిలీలో ఏం జరిగినా అది వారి వ్యక్తిగతం. ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే. ఈ విషయం పోలీసులకు ఎందుకు గుర్తు రావడం లేదో ?