గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేశారు రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి. పేరుకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మనే కానీ పంక్తు వైసిపీ కార్యకర్తగానే వ్యవహరించారు పోసాని.
టీడీపీ, జనసేన పార్టీ నాయకులని అతి దారుణంగా విమర్శించిన వారిలో పోసాని కృష్ణమురళి కూడా వున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని తిట్టడానికే జగన్ ఆ పదవిని ఇచ్చినట్లుగా వ్యవహరించారు. ఆ ఐదేళ్ళలో ఫిల్మ్ డెవలప్ కోసం తను చేసి ఒక్క పని కూడా చెప్పుకొలేని పరిస్థితి ఆయనది. ఆయన పెట్టిన ప్రెస్మీట్లన్నీ టీడీపీ, జనసేనని విమర్శించడానికే.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. నామినేట్ పదవులు అనుభవించిన వారంతా స్వచ్చందంగా తప్పుకోవడం రివాజు. అదే గౌరవం, మర్యాద కూడా. కానీ పోసాని నుంచి ఇంకా రాజీనామా లేఖ రాలేదు. బహుసా ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చేవరకూ ఎదురుచూస్తున్నారేమో.
నోరు తెరిస్తే చాలు ‘నాకు పద్దతులు తెలుసు, చదువుకున్నాను. ఐయామ్ వెల్ బిహేవ్డ్ పర్శన్’ అని చెప్పుకునే పోసానికి ప్రభుత్వం మారిన తర్వాత నామినేట్ పదవికి రాజీనామా చేయాలనే కామన్ సెన్స్ లేకపోవడం విడ్డూరమే.