అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ లాంటి 24 క్యాడర్లకు ఇప్పటి వరకు సంప్రదాయ మార్కుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎవరికి వచ్చిన మార్కులను బట్టి వారికి క్యాడర్ వస్తుంది. దీన్నిమార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు యూపీఎస్సీ మూడంచెల పరీక్ష.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో అభ్యర్థులు సాధించే మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఇప్పటి వరకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి క్యాడర్లకు ఎంపిక చేస్తారు. ఈ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. దీనిప్రకారం యూపీఎస్సీ నిర్వహించే మూడంచెల పరీక్షలో విజయవంతమైన అభ్యర్థులకు తదుపరి మూడు నెలలు ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తారు. ఈ సమయంలో అభ్యర్థిని అన్ని విధాలా పరీశీలించి, వారిని వ్యక్తిగతం, నాయకత్వ పరంగా పరీక్షించి క్యాడర్‌కు ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ 3 నెలల సమయంలో అభ్యర్థుల ప్రతిభా పాటవాలను గుర్తించి వాటి ఆధారంగా వారిని ఏ క్యాడర్‌కు పంపాలో నిర్ణయించనున్నారు. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియజేయాలని ప్రధానమంత్రి కార్యాలయం సంబంధిత అన్ని కార్యాలయాలకు లేఖలు రాసింది.
నిజానికి ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలని.. ఎందుకు నిర్ణయం తీసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. యూపీఎస్పీ… పకడ్బందీగా పరీక్షలు నర్వహిస్తుంది. కానీ.. అంత పకడ్బందీగా…ఈ ఫౌండేషన్ కోర్సు ఉంటుందా.. అన్నదే సందేహం. నేను.. ముస్సోరీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా అనేక సార్లు వెళ్లి వచ్చారు. హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో దశాబ్దం పాటు క్లాసులు చెప్పాను. ఈ అనుభవంతో నేను ఏమీ అనుకుంటున్నారంటే.. యూపీఎస్సీ నిర్వహించినంత.. పకడ్బందీగా ఈ ఫౌండేషన్ కోర్సు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే… ప్రధానమంత్రి కార్యాలయం జారీ చేసిన నోట్ లో ఎందుకు ఈ మార్పు తేవాలనుకుంటున్నారో విషయాన్ని చెప్పలేదు.
మూడు మాసాల ఫౌండేషన్ కోర్సులో ప్రతిభ చూపితేనే అభ్యర్థులకు ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లు వస్తాయి. అంటే… ఈ నిర్ణయం వెనుక కచ్చితంగా కొంత రహస్యం ఉందని భావించక తప్పదు. తమ వారిని మాత్రమే ఐఏఎస్ పోస్టులకు ఎంపిక చేసుకునేందుకు ఈ ఫౌండేషన్ కోర్సును పెట్టాలనుకుంటున్నట్లు నాకనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఫౌండేషన్ కోర్సులో ఉన్న సివిల్స్ ర్యాంకర్లకు ఫ్యాక్టల్టీగా.. తమ భావజాలం ఉన్న వారినే ఫ్యాకల్టీగా పంపి… తమ వారినే ఎంపిక చేసుకునేలా చేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని బీజేపీ అనేక సార్లు నిజం చేసి చూపించింది. కీలకమైన స్థానాల్లో… తమకు అనుకూలంగా ఉన్నవారినే నియమించుకుంటోంది. ఆరెస్సెస్ భావజాలం ఉన్నవారికే ఉన్నతమైన స్థానాలు దక్కుతున్నాయి. దీనికి మంచి ఉదారణ జస్టిస్ జోసెఫ్ నియామకం వివాదం. సుప్రంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినా… కేంద్రం దానికి ఆమోదించలేదు.
ఇప్పుడు సివిల్స్ ర్యాంకర్ల ఫౌండేషన్ కోర్సుపైనా.. అదే తరహా ప్రయోగం చేస్తున్నారు. ఎవరు ఐఏఎస్, ఎవరు ఐపీఎస్ కావాలనేది.. ఈ ఫౌండేషన్ కోర్సు ద్వారా డిసైడ్ చేస్తారు. ముందుగా చెప్పినట్లు ఆరెస్సెస్ భావజాలం ఉన్నవారినే ఎంపిక చేయడానికే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జరుగుతుందన్న గ్యారంటీ లేదు. కానీ ఇంత యూపీఎస్సీ నియామకాల్లో ఇంత విప్లవాత్మకమైన మార్పులు తేవాలనుకున్నప్పుడు.. ఉద్దేశాలు ఏమిటో బయటపెట్టాలి. దేశంలో యూపీఎస్సీ నియామకాలకు సంబంధం ఉన్న ప్రతి వర్గంలోనూ చర్చ జరగాలి. లేకపోతే.. ఈ ప్రతిపాదన చాలా ప్రమాదకరం.