‘అవతార్ 2’ కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అవతార్ సృష్టించిన మ్యాజిక్ ఓ కారణమైతే… ‘అవతార్ 2’ సినిమాతో పాటుగా ‘పుష్ప 2’ గ్లిమ్స్ కూడా విడుదల చేయాలనుకోవడం మరో కారణం. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న పుష్ప సూపర్ డూపర్ హిట్టయ్యింది. దాంతో పుష్ప 2పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ సినిమా పట్టాలెక్కింది. ‘అవతార్ 2’ ఆడుతున్న థియేటర్లలో `పుష్ప 2` గ్లిమ్స్ విడుదల చేయాలని భావించారు. అందుకోసం ఓ టీజర్ షూట్ కూడా చేశారు. అయితే… ఈ గ్లిమ్స్ అవతార్‌తో పాటు బయటకు రాలేదు.
దానికి చాలా కారణాలున్నాయి. ఇటీవల పుష్ప టీమ్ రష్యా వెళ్లొచ్చింది. ఇది సడన్‌గా సెట్ చేసిన షెడ్యూల్. దాంతో.. ‘పుష్ప 2’ గ్లిమ్స్‌కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమైంది. దాంతో పాటుగా ‘పుష్ప 2’లో డైలాగ్ ఇదే.. అంటూ ఓ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ డైలాగ్ లీక్ అయిపోవడంతో ‘గ్లిమ్స్’ అంతగా కిక్ ఇవ్వదేమో అని చిత్రబృందం భావించిందట. దాంతో ఆ డైలాగ్ మార్చి మరో టీజర్ రెడీ చేసే పనిలో పడిందని టాక్. డిసెంబరు 31న గానీ, సంక్రాంతి పండక్కి గానీ కొత్త గ్లిమ్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. అవతార్ లో పుష్ప కనిపించలేదు.