రఘురామ కృష్ణరాజు, ఆయన కుమారుడు, పీఏతో పాటు ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపైనా హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు కేసు పెట్టారు. ఏపీ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషా వీరందరూ తనపై దాడి చేసి కొట్టారని కేసు పెట్టారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఆ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ఎంపీ ఇంట్లోకి చొరబడబోతూండగా పట్టుకున్నామని సీఆర్పీఎఫ్ ఇచ్చిన ఫిర్యాదును గచ్చిబౌలి పోలీసులు పట్టించుకోలేదు.
కానీ ఇక్కడ కేసులో విచిత్రమైన కోణాలు ఉన్నాయి. తాను ఐఎస్బీ దగ్గర డ్యూటీ చేస్తూడంగా పట్టుకెళ్లారని ఏపీ ఇంటలిజెన్స్ పోలీసు చెబుతున్నారు. ఏపీలో డ్యూటీ చేయాల్సిన పోలీసు ఐఎస్బీ దగ్గర ఎందుకున్నారంటే… ప్రధాని పర్యటన కోసం వచ్చానని చెబుతున్నారు. నిజానికి ప్రధాని పర్యటన ఏపీలో ఉంది. అంతకు ముందు రోజే హైదరాబాద్లో ముగిసిపోయింది. అసలు బందోబస్తుకు ఏపీ పోలీసుల్ని పంపడం ఏప్పుడో ఆగిపోయింది. పంపినా ఏపీ ఇంటలిజెన్స్ పోలీసుల్ని పంపుతారా అనే డౌట్ మనం అడగకూడదు పోలీసులు చెప్పకూడదు.
అసలు ఆ పోలీసు ఏపీ ఇంటలిజెన్స్ పోలీసే అయితే.. ఎక్కడో ఐఎస్బీ దగ్గర డ్యూటీ చేస్తూంటే.. రఘురామ కానీ ఆయన టీమ్ కానీఎందుకు కిడ్నాప్ చేస్తుంది. ఆయనకేమైనా పాత గొడవలు ఉన్నాయా ? అసలు తెలిసే అవకాశం ఉందా ?చాన్సే లేదు. కానీ తనను తీసుకెళ్లారని ఆయన చెబుతున్నారు. గచ్చి బౌలి పోలీసులు నమ్మేశారు. ఎంపీనే నేరుగా దాడి చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. కేసు పెట్టేశారు. సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర జగన్ కోసం పని చేస్తున్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ కేసు చూస్తేఅలాగే ఉంది.
ఏపీ పోలీసులు కూడా ఈ అంశంపై ప్రకటన చేశారు. రఘురామ ఇంటి వద్ద ఇంటలిజెన్స్ పోలీసులను నిఘా పెట్టలేదని ఏపీ పోలీసులు ప్రకటించారు. ప్రధాని పర్యటన సందర్బంగా కానిస్టేబుల్ ఐఎస్బీ గేట్ వద్ద స్పాటర్గా ఉన్నాడని తెలిపారు. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులకు హైదరాబాద్లో డ్యూటీ వేసినట్లుగా ఏపీ పోలీసులు ెబుతున్నారు. కానిస్టేబుల్ ఫరూక్ విధులకు, రఘురామ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. రఘురామ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఫరూక్ విధుల్లో ఉన్నాడని తెలిపారు. అక్కడ్నుంచే రఘురామ భద్రతా సిబ్బంది ఫరూక్ ను తీసుకెళ్లారని చెప్పారు. ఎందుకు తీసుకెళ్లారు అనేది మాత్రం చెప్పలేకపోయారు.. పోలీసులు అయితే మాత్రం తీసుకెళ్లి రఘురామ టీం కొడుతుందా అనే డౌట్ మాత్రం కామన్. కానీ మన దగ్గర ఎమైనా జరగొచ్చు.. కావాలనుకుంటే ఎలాంటి కేసులైనా పెట్టొచ్చని చాలా సార్లు నిరూపితమైంది. మరోసారి తెలిసింది.