సంధ్య ధియేటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి చిత్రసీమ ముందుకు వస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తన తరపున రూ.1 కోటి సహాయం అందించాడు. మైత్రీ మూవీస్, సుకుమార్ కలిసి మరో రూ.కోటి ఇచ్చారు. దిల్ రాజు ముందుకు వచ్చి… రేవతి భర్తకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ విరాళాలు సేకరిస్తోంది. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా తమ వంతు సహాయం అందిస్తామని మాట ఇచ్చింది.
కానీ రష్మిక మాత్రం మిస్సయిపోయింది. పుష్ప 2లో తనే కథానాయిక. ఘటన జరిగినప్పుడు బన్నీతో కలిసి సినిమా చూడ్డానికి వెళ్లింది కూడా. కానీ.. ఈ ఘటనపై తాను స్పందించలేదు. ఆర్థిక సహాయం ప్రకటించలేదు. దాంతో రష్మికని ట్రోల్ చేస్తున్నారంతా. అసలు ఏ 11గా బన్నీని చేర్చినప్పుడు, రష్మికపై కూడా కేసు నమోదు చేయాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. కేసు సంగతి సరే – కనీసం తన వంతు బాధ్యతగా ముందుకు రావాలి కదా? ఎంతో కొంత సహాయం అందించాలి కదా?
సంధ్య ధియేటర్‌కి సుకుమార్ రాలేదు. ఈ ఇష్యూతో ఆయనకు సంబంధమే లేదు. అయినా సరే.. మానవత్వంతో రూ.50 లక్షలు అందించాడు. రష్మిక నుంచి ఇలాంటి మినిమం స్పందన మాత్రం కరువైంది. సినిమా పరిశ్రమ అమ్మలాంటిదని, అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొనే కథానాయికలు ఇలాంటి విషయాల్లో మాత్రం ఎందుకో మానవత్వం చూపించరు.