హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపాఫీస్‌గా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌కు పేరుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ గెస్ట్ హౌస్‌ను ఏపీకి కేటాయిచారు. చంద్రబాబునాయుడు మొదట్లో అక్కడ్నుంచే కొంతకాలం కార్యకలాపాలు నిర్వహించారు. తర్వాత అమరావతి వెళ్లిపోవడంతో ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే వాడేవారు. తర్వాత పట్టించుకోలేదు. జగన్ సీఎం అయిన తర్వాత దాన్ని అసలు పట్టించుకోలేదు.ఇటీవల వర్షాల సమయంలో ఆ గెస్ట్ హౌస్ నిండా నీళ్లు వచ్చాయని మీడియాలో ప్రచారం జరిగింది.
జగన్ సెక్రటేరియట్ భవనాలను తెలంగాణ సర్కార్‌కు అప్పగించారు కానీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్‌ను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. నిర్వహణ లేక పాడైపోయిన వాటిని తొలగించి రిపేర్లు చేస్తున్నారు. ఉపయోగించుకోవడానికి అనుకూలంగా మారుస్తున్నారు. దాన్ని ఇతర అవసరాలకు వాడే అవకాశం లేదు. సీఎం జగన్ మాత్రమే ఉపయోగించగలరు. దీంతో జగన్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అక్కడే ఉండాలనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జగన్‌కు హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఇల్లుంది. ఆయన అక్కడికే వెళ్తారు. కానీ లేక్ వ్యూ ఎందుకు అన్న సందేహం వినిపిస్తోంది. సీఎం జగన్ హైదరాబాద్ వచ్చేది కూడా తక్కువేనని గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ సీబీఐ కేసుల్లో రోజువారీ విచారణ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. రిజర్వ్‌లో ఉంది . ఆ తీర్పు సానుకూలంగా వచ్చే అవకాశం లేదని.. ముఖ్యమంత్రి అన్న కారణంగా విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు దొరకదని భావిస్తున్నారు. ఈకారణంగానే లేక్ వ్యూను రెడీ చేయిస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వంలో కూడా జరగబోయే పరిణామాలపై ఓ క్లారిటీ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.