“పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం” ఒకప్పుడు మీడియా వర్గాలు ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియా వర్గాలు ఎంతగానో ఎదురు చూసే సందర్భం అది. తాడేపల్లి ప్యాలెస్ లో అయినా, తిరుమల కొండ అయినా మైక్ దొరికితే చాలు మేడం గారు తాండవం ఆడేవారు. కాని ఇప్పుడు మాత్రం సీన్ అంతా రివర్స్ లో నడుస్తోంది. అసలు రోజా మీడియా సమావేశాలు ఎక్కడా కనపడటం లేదు. కాని రోజా విరుచుకుపడ్డారు, దుమ్మెత్తిపోశారు, రోజా మార్క్ కామెంట్స్ అంటూ కాస్త అప్పుడప్పుడు హడావుడి నడుస్తోంది.
కానీ… కానీ… మీడియా మైకుల ముందుకు మాత్రం రోజా రావడం లేదు. అరెస్ట్ భయమో లేక మొహం చెల్లకో ఆమె సొంత నియోజకవర్గానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఎప్పుడైనా మాట్లాడినా ఓ రికార్డ్ వీడియో వదులుతున్నారు. అందులోనే కౌంటర్ లు సెటైర్ లు. అవి కూడా పెద్ద ఘాటుగా ఏం ఉండటం లేదు. ఎవరో కోసం మాట్లాడినట్టే ఉంటున్నాయి. అసలు రోజా ఇండియాలో లేరని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె తన కుమార్తె వద్ద ఉంటున్నారని… ఇప్పట్లో ఇండియా వచ్చే అవకాశం లేదని అంటున్నారు.
మీడియా ముందుకు వస్తే మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తమ అధినేత జగన్ పద్ధతినే ఈ విషయంలో రోజా ఫాలో అవుతున్నారు. ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ అయి వచ్చి అది మాట్లాడేసి… ఏమైనా ప్రశ్న అడిగితే… డిస్ట్రబ్ చేయకు అంటూ వెళ్ళిపోతున్నారు జగన్. విజయవాడ వరదల్లో జరిగింది అదే. కాకినాడ జిల్లా వరదల్లో కూడా అదే సీన్ రిపీట్. ఈ బాధ అంతా ఎందుకని ప్రజలను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమాన్ని మళ్ళీ బయటకు తీసి… మాట్లాడేస్తున్నారు. లడ్డూ వ్యవహారం అంత జరుగుతున్నా జగన్ మీడియాను ఫేస్ చేయలేదు. పొరపాటున ఏ టీడీపీ అనుకూల మీడియాకో రోజా దొరికితే లేని పోనీ ప్రశ్నలు అన్నీ అడిగే అవకాశం ఉంటుంది. అందుకే రికార్డ్ చేయడం మినహా లైవ్ కి రోజా ఆసక్తి చూపడం లేదు. ఏదేమైనా రోజా లాంటి నేత మీడియా ముందుకు రాకపోవడంతో పెద్దగా పొలిటికల్ వార్తల్లో స్టఫ్ ఉండటం లేదనే భావన చాలా మందిలో ఉంది.