వివేకా హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసిందంటూ.. సొంత పత్రికతో పాటు పెట్టుకున్న సలహాదారులతో జాతీయ వెబ్ సైట్లలోనూ ఇండిపెండెంట్ జర్నలిస్టులతో పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు చార్జిషీట్ లో తన పాత్రను కూడా తేటతెల్లం చేసే వ్యవహారం ఉందని అర్థమైనట్లుగా ఉంది. మీడియా ముందుకు వచ్చి గంట సేపు.. అమ్మతోడు.. నాకేమీ తెలియదన్నట్లుగా తనదైన పద్దతిలో వాదించారు. తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్కులతో… ఇలా జరగుతుందా.. జరగదుగా..అలా జరుగుతుంది..కానీ సీబీఐ పట్టించుకోలేదు..ఇది చంద్రబాబు కుట్ర అంటూ చెప్పుకొచ్చారు.
ఎప్పుడో నాలుగేళ్ల నుండి సీబీఐకి వివేకా కేసులో సాక్షులు ఇచ్చిన స్టేట్ మెంట్లు ఇప్పుడు చార్జిషీటుతో పాటు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడే ఏదో ఇచ్చినట్లుగా ఆయన గగ్గోలు పెడుతూ తెర ముందుకు వచ్చారు. సునీతతో ప్రెస్ మీట్లు పెట్టించడం.. టీడీపీ నేతలపై ఫిర్యాదులు చేయించాలని చూడటం.. అవినాష్ పై అనుమానం లేదని ముందే ప్రకటనలు ఇప్పించే ప్రయత్నం చేయడం మొత్తం సునీత సీబీఐకి స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం వెలుగులోకి రావడంతో ఆయన కంగారు పడుతున్నట్లుగా ఉన్నారు. నాలుగేళ్ల కిందట తాను భారతికి ఫోన్ చేసిన మాట్లాడిన దాన్ని పట్టుకుని ఇప్పు్డు కొత్త కథ అల్లుతున్నారని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల కిందట సజ్జల భారతితో ఫోన్ మాట్లాడారో లేదో చాలా సార్లు మాట్లాడి ఉండవచ్చు..కానీ ఆ ఒక్క ఫోన్ కాల్ గురించే ఎందుకు సజ్జల చెబుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు.
వివేకాహత్యకు గురైతే నష్టపోయేది తామేనని చెప్పుకోవడానికి సజ్జల చెప్పుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. సీబీఐ దర్యాప్తు అంతా చంద్రబాబు చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు. నిజంగా చంద్రబాబు అంతగా సీబీఐని దర్యాప్తు చేయగలిగితే.. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఎలా ఉండేవో ఆయన ఊహించి ఉంటే.. ఈ ఆరోపణలు చేసి ఉండే వారు కాదు. కుటుంబసభ్యుడ్ని .. అంతా ఓ ప్రణాళిక ప్రకారం..ఖూనీ చేసి .. దాన్ని చంద్రబాబుపైకి తోసేయడానికి ప్లాన్ చేసి కుదరక.. రెండో భార్య మీద.. చివరికి సునీత మీదకూ నెట్టేందుకు కుట్రలు చేశారు. అవన్నీ ఫెయిలయ్యాయి..ఇప్పుడు విషయం దగ్గరకు వస్తుందనే సరికి కంగారు పడిపోతూ మీడియా ముందుకు వచ్చి రంకేలేస్తున్నారు.
సజ్జల అయినా.. అవినాష్ రెడ్డి అయినా చెప్పాలనుకున్నది కోర్టుకు చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తున్నారన్నది కీలకం. సజ్జల గంట సేపు పెట్టిన ప్రెస్ మీట్ లో అసలు కొసమెరుపేరమిటంటే.. వివేకా గౌరవాన్ని.. పరువు ప్రతిష్టలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారట.. ఆయనపై స్త్రీలోలుడు అనే దగ్గర్నుంచి అన్ని రకాల నిందలేస్తూ సాక్షిలో రాసింది ఎవరిగీ గుర్తుండదని అనుకుంటారేమో ? జనాల్ని ఓ మాదిరిగా చూడని సజ్జల లాంటి వాళ్లకు రోజులెప్పుడూ ఒకేలా ఉంటాయని కూడా తెలుసుకోలేరేమో అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.