వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్య.. సామాన్యుల్లో ఎన్నో అనుమానాలను మిగిల్చింది. ఉదయం అంతా.. ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పారు. చివరికి ఆయన ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత ఇంత పక్కాగా హత్య అని తెలిసి.. ఎందుకు సహజరమణంగా చిత్రీకరించారనే అనుమానం బలపడటం ప్రారంభించింది. ఈ లోపే… తప్పని సరిగా వివేకా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపడంతో… వైసీపీ నేతల స్వరాల్లో మార్పు రావడం ప్రారంభమైంది. అలా వచ్చిన మార్పులో మొదటి వాక్యం..” వైఎస్ వివేకా అనుమానాస్పద మృతి వెనుక చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణరెడ్డి హస్తం ” ఉందని చెప్పడం..!
సాక్షి మీడియానే శవరాజకీయానికి సాక్ష్యాలు ఇస్తోందా..?
వైఎస్ వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా తీరే… అసలు … వారి కుటుంబంపై అనుమానాలు రేకెత్తించేలా చేసింది. ఉదయం ఆరు గంటలకు విషయం తెలిస్తే.. తొమ్మిది గంటల వరకు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. అప్పుడు కూడా.. గుండెపోటు మరణం.. స్టెంట్ వేయించుకున్నారని… రకరకాలుగా ప్రచారం చేశారు. చివరికి.. హత్య అని బయట పడుతుందని తెలిసిన తర్వాత మాట మార్చారు. ఇప్పుడు.. ఆ విషయాన్ని సమర్థించుకోవడానికి రకరకాల కథనాలు అల్లుతున్నారు. రక్తపు వాంతులు చేసుకున్నారని అనుకున్నారని.. మరొకటని.. ఇలా రకరకాలుగా కథలు వండి వారుస్తున్నారు. ఓ తప్పు చేసి.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తున్నారని… చాలా సులువుగా అర్థమైపోతూనే ఉంది.
శవ రాజకీయంతో జగన్ ఏం సాధించాలనుకున్నారు..?
వైఎస్ వివేకా.. అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని.. ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది. ఇక ప్రత్యక్షంగా చూసిన వారికి తెలియకుండా ఉంటుందా..? అదీ ఫ్యాక్షన్‌లో పుట్టి పెరిగిన వారికి..!. కచ్చితంగా తెలుసు… ఆరు..ఆరున్నరకు విషయం తెలిసినా… బయట ప్రపంచానికి జగన్ మీడియా సాక్షినే .. తొమ్మిది గంటల తర్వాత గుండెపోటుతో మృతి అంటూ కథనాలు అల్లింది. ఆయన మృతి నుంచి సానుభూతి పొందేందుకు… ఫైల్ షాట్స్ వేసి.. ఆయన జ్ఞాపకాల దొంతరలను… ఫైల్ షాట్స్‌తో దొర్లించే ప్రయత్నం చేసింది. డెడ్‌బాడీ పోస్టుమార్టానికి వెళ్లే వరకూ… ఎవరూ… ఆయనది హత్య అని అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఈ లోపే సాక్ష్యాలు తుడిచేయడం… వివేకా గాయాలు కనిపించకుండా కట్లు కట్టడం లాంటివి చాలా చేశారు. చివరికి పోస్టుమార్టం కూడా వద్దనుకున్నారు. పోలీసు కేసులు అసలే వద్దనుకున్నారు. కానీ.. ఇక హత్య అన్న విషయం బయటకు రాక తప్పని పరిస్థితుల్లోనే.. నేరుగా… తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు ప్రారంభించారు.
సాక్ష్యాలు తారుమారు చేసి టీడీపీపై ఆరోపణలు చేస్తే నేరం మాసిపోతుందా..?
హత్యను దాచి పెట్టి… సాక్ష్యాలను తారుమారు చేసి… స్మూత్‌గా… అంత్యక్రియలు జరిపించేయాలని… వైఎస్ కుటుంబీకులు ప్రయత్నించారనేది బహిరంగరహస్యం. కానీ ఇప్పుడు దాన్ని టీడీపీపైకి మళ్లించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణరెడ్డిను గురి పెట్టి తీవ్రమైన రాజకీయ విమర్శలు చేశారు. పోలీసులపై నమ్మకం లేదని ఎప్పుడూ చెప్పే రొటీన్ డైలాగ్ చెప్పారు. సీబీఐ విచారణ కావాలన్నారు. కానీ వివేకా హత్య విషయంలో… జరిగిన సీన్ టు సీన్ ను చూస్తే… నేరం ఎవరిదో క్లారిటీ వచ్చేస్తుంది. వీటిపై మరింత విస్తృతమైన చర్చ జరగకుండానే… విషయాన్ని పక్కదారి పట్టించడానికే… తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు ప్రారంభించారనేది… ఏ కొద్ది అవగాహన ఉన్న వారికైనా తెలుస్తుంది. అయితే.. ఉదయం అంతా జరిగిన పరిణామాలే ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి కానీ.. టీడీపీపై జగన్ చేసే ఆరోపణలు కాదు.